Coconut Oil: రాత్రి నిద్రకు ముందు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

Updated on: Mar 27, 2026 | 12:49 PM

దుమ్ము, కాలుష్యం చర్మాన్ని దెబ్బతీస్తాయి. రోజువారీ ఒత్తిడి ప్రభావాలు చర్మంపై కనిపిస్తాయి. అందువల్ల చర్మ సంరక్షణ కోసం ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు, తేమను అందించే గుణాలు..

1 / 5
దుమ్ము, కాలుష్యం చర్మాన్ని దెబ్బతీస్తాయి. రోజువారీ ఒత్తిడి ప్రభావాలు చర్మంపై కనిపిస్తాయి. అందువల్ల చర్మ సంరక్షణ కోసం ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు, తేమను అందించే గుణాలు చర్మానికి లోతైన పోషణను అందించడంలో సహాయపడతాయి.

2 / 5
కొబ్బరి నూనె ఒక అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్. రాత్రి పడుకునే ముందు దీనిని మీ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం రాత్రంతా తేమగా ఉండి, పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

3 / 5
కొబ్బరి నూనె మృత చర్మ కణాలను తొలగించి, చర్మం కాంతిని పెంచి, తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. కాబట్టి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవడానికి ప్రతి రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనెను రాసుకోవాలి.

4 / 5
కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ వంటి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు, మొటిమలకు కారణమయ్యే సూక్ష్మక్రిములతో పోరాడటానికి, చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది ముడతలు, పొడిదనాన్ని కూడా తగ్గిస్తుంది.

5 / 5
కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి కొబ్బరి నూనె ఒక అద్భుతమైన పరిష్కారం. రాత్రి పడుకునే ముందు కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతంలో కొబ్బరి నూనెను సున్నితంగా మర్దనా చేయడం వల్ల అలసట తగ్గి, నల్లటి వలయాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

Follow Us