నిమ్మకాయలు 10 నెలలైనా ఫ్రెష్‌గా ఉండాలా.. ఎవరూ చెప్పని సూపర్ ట్రిక్స్ ఇవే..

Updated on: Jul 28, 2026 | 8:08 AM

వంటగదిలో నిమ్మకాయలది స్పెషల్ ప్లేస్. సలాడ్లు, జ్యూస్‌లు, రకరకాల వంటకాల్లో నిమ్మరసం నిత్యం వాడుతుంటాం. అయితే మార్కెట్ నుండి తెచ్చాక కొన్ని రోజులకే అవి ఎండిపోయి, కుళ్ళిపోతుంటాయి. ధర తక్కువగా ఉన్నప్పుడు కొన్న నిమ్మకాయలు ఇలా వృధా కావడం అందరినీ వేధించే సమస్యే. ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేకుండా చిన్న చిట్కాలను ఉపయోగించి నెలల తరబడి ఎలా నిల్వచేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం..

1 / 5
నిమ్మరసాన్ని తరచుగా వాడేవారికి ఐస్ క్యూబ్ ట్రేలు బాగా ఉపయోగపడతాయి. నిమ్మకాయలను పిండి, గింజలు, గుజ్జును వేరు చేసి స్వచ్ఛమైన రసాన్ని మాత్రమే ఐస్ క్యూబ్ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. ఈ ఐస్ క్యూబ్‌లను ఒక జిప్ లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే, వాటి రుచి, సువాసన ఏకంగా 10 నెలల వరకు దెబ్బతినవు. అవసరమైనప్పుడు ఒక క్యూబ్‌ను తీసి సూప్, జ్యూస్ లేదా సలాడ్‌లో నేరుగా వేసుకుంటే క్షణాల్లో పని పూర్తవుతుంది.

2 / 5
 నిమ్మకాయలను కోయకుండా గ్రేట్ క్వాలిటీతో పూర్తిగా నిల్వ చేసుకోవచ్చు. ముందుగా పండ్లను శుభ్రంగా కడిగి, తేమ లేకుండా తుడిచి, గాలి చొరబడని డబ్బా లేదా జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా చేస్తే నిమ్మకాయలు 3 నుండి 4 నెలల వరకు పాడవకుండా తాజాగా ఉంటాయి. వీటిని ఉపయోగించడానికి కొన్ని నిమిషాల ముందు బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే, సులభంగా రసం తీయడానికి సిద్ధమవుతాయి.

3 / 5

టీ, లెమన్ డ్రింక్స్ కోసం నిమ్మకాయ ముక్కలను ఫ్రీజ్ చేయవచ్చు. నిమ్మకాయను పలుచని గుండ్రని ముక్కలుగా కోసి, గింజలను తీసివేసి, ఒక ప్లేట్‌లో విడివిడిగా అమర్చి గంటసేపు ఫ్రీజ్ చేయాలి. ఆ తర్వాత వాటిని ఒక బ్యాగ్‌లోకి మార్చి నిల్వ చేసుకుంటే, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. కావలసినప్పుడు విడివిడిగా బయటకు తీసి పానీయాలలో నేరుగా వాడుకోవచ్చు.

4 / 5
నిమ్మకాయలను నిల్వ చేసే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. పండ్లను నిల్వ చేసే ముందు తప్పనిసరిగా శుభ్రంగా కడగాలి. దీనివల్ల తొక్కపై ఉండే మైనం, పురుగుమందుల అవశేషాలు,  దుమ్ము తొలగిపోతాయి. కడిగిన తర్వాత తేమ చుక్క కూడా లేకుండా శుభ్రమైన గుడ్డతో తూడవడం చాలా ముఖ్యం. అలాగే నిల్వ ఉంచిన కంటైనర్లు లేదా జిప్ లాక్ సంచులపై తేదీని రాసి ఉంచడం వల్ల అవి ఎంతకాలంగా ఉన్నాయో సులభంగా గుర్తుంటుంది.

5 / 5
గడ్డకట్టిన నిమ్మకాయలను ఒకసారి బయటకు తీసి వాడిన తర్వాత మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టకూడదు. అలా చేస్తే వాటి నాణ్యత, రుచి దెబ్బతింటాయి. మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలను పాటిస్తే, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఆహారం వృధా కాకుండా ఉంటుంది. ఇంట్లో నిమ్మకాయల కొరత లేకపోవడం వల్ల అనుకోకుండా అతిథులు వచ్చినా ఎలాంటి కంగారూ పడాల్సిన పనిలేదు.

Follow Us