వార్నీ ఇంత ఈజీనా.. కెమికల్ అరటిపండ్లను చిటికెలో ఇలా కనిపెట్టండి..

Updated on: Nov 28, 2026 | 6:52 PM

పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పండు అరటిపండు. ఏ సీజన్‌లోనైనా సులభంగా లభించే, తక్కువ ఖర్చుతో తక్షణ శక్తిని అందించే ఈ పండు దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. మీరు కొంటున్న అరటిపండ్లు సహజంగా పండినవా? లేక రసాయనాలతో పండించినవా? ఎందుకంటే చూడటానికి నిగనిగలాడుతూ, మచ్చలు లేకుండా ఉండే పండ్లే కొన్నిసార్లు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు. రసాయనాలతో పండించిన అరటిపండ్లను ఇట్టే పసిగట్టే సులభమైన చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
మార్కెట్లో డిమాండ్ పెరగడంతో కొందరు వ్యాపారులు పచ్చి అరటిపండ్లను త్వరగా పండించేందుకు రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇలా రసాయనాలతో పండించిన పండ్లు బయటకు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వాటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సహజంగా పండిన పండ్లను, రసాయనాలతో పండించిన వాటిని గుర్తించే విధానం ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. రిషికేశ్‌కు చెందిన పూనమ్ పంచుకున్న కొన్ని సులభమైన చిట్కాలు ఇందులో ఎంతగానో ఉపయోగపడతాయి.

2 / 5
అరటిపండు సహజంగా పండిందా లేదా రసాయనాలతో పండించారా అని తెలుసుకోవడానికి దాని కాండాన్ని పరిశీలించడం ఒక మంచి మార్గం. కాండం నల్లగా లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే అది చెట్టు మీద సహజంగా పండినట్లుగా భావించవచ్చు. అదే పండు మొత్తం పసుపు రంగులో ఉండి, కాండం తెల్లగా లేదా పూర్తిగా ఎండిపోయి ఉంటే మాత్రం రసాయనాల సాయంతో పండించి ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3 / 5
రంగు, మచ్చల ద్వారా కూడా తేడాను సులభంగా గమనించవచ్చు. చాలామంది నల్ల మచ్చలు ఉంటే పండు పాడైపోయిందని అనుకుంటారు.. కానీ నిజం వేరు. సహజంగా పండిన అరటిపండ్లపై చిన్నపాటి గోధుమ లేదా నల్లటి మచ్చలు ఉంటాయి. వాటి రంగు కూడా అన్నిచోట్లా ఒకేలా కాకుండా పసుపు, ఆకుపచ్చ ఛాయలు కలిసి ఉంటాయి. దీనికి విరుద్ధంగా, రసాయనికంగా పండించిన పండ్లు విపరీతమైన పసుపు రంగులో, నిగనిగలాడుతూ ఎటువంటి మచ్చలు లేకుండా కనిపిస్తాయి. అయితే ఎక్కువ మెరుపు ఎప్పుడూ మంచిది కాదని గుర్తుంచుకోవాలి.

4 / 5
రుచి, వాసన, ఆరోగ్య ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సహజమైన అరటిపండ్లు లోపల మెత్తగా, తియ్యగా ఉండి సహజమైన సువాసనను కలిగి ఉంటాయి. వాటిలో పీచుపదార్థం, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ రసాయనాలతో పండించినవి బయట మెత్తగా ఉన్నా లోపల గట్టిగా ఉండటంతో పాటు కొన్నిసార్లు ఔషధం లాంటి వాసన రావచ్చు. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో పండించిన పండ్లను దీర్ఘకాలం తింటే కడుపు నొప్పి, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5 / 5
అందుకే వచ్చేసారి అరటిపండ్లు కొనేటప్పుడు కేవలం వాటి మెరుపు, రంగు చూసి మోసపోకుండా కాస్త జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. సహజంగా పండిన పండ్లు చూడటానికి సాధారణంగా కనిపించినా, పోషకాలు, నాణ్యత విషయంలో అవి ఎంతో మేలైనవి. కొద్దిపాటి అవగాహనతో ఎంపిక చేసుకుంటే మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us