
వేపాకు: బియ్యంలో ఉండే పురుగులను తరికొట్టడంతో మన తాతల కాలం నుంచి ఉపయోగిస్తున్న ప్రభావమైన చిట్కా వేపాకులు.. వీటికి ఉండే చేదు వాసన.. ఔషద గుణాలు బియ్యంలోని పురుగులను వాటి గుడ్లను నశింపజేయడంతో చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి మీరు కొన్ని ఎండిన వేప ఆకులను తీసుకొని వాటిని బియ్యం డబ్బాలో కలిపేయండి. లేదా ఆకులను ఒక క్లాత్‌లో చుట్టి బియ్యం డబ్బాలో వేయండి. ఇలా చేయడం ద్వారా వాటిలో ఉన్న పురుగుతు తొలగిపోతాయి. మిళ్లీ కొత్త పురుగులు కూడా లోపలికి రాకుండా ఉంటాయి.

బిర్యానీ ఆకు, లవంగం: మన కిచెన్‌లో వాడే ఘాటైన మసాల దినుసుల స్మెల్ కీటకకాలకు, పురుగులకు తీవ్రమైన ఇబ్బందుకులు గురిచేస్తుంది. కాబట్టి మీరు 5 బిర్యానీ ఆకులు, ఒక స్పూన్ లవంగాలను తీసుకొని బియ్యం డబ్బాలో వేయండి. అవి బియ్యం మొత్తం కలిసేలా బాగా కలపండి. వీటి నుంచి వచ్చే ఘాటైన వాసనకు తట్టుకోలేక బియ్యంలో ఉన్న పరుగులు మొత్తం బయటకు వెళ్లిపోతాయి. మళ్లీ ఆవైపునకు కూడా రాకుండా ఉంటాయి.

పొడి వెల్లుల్లి రెబ్బలు: బియ్యం పురుగును పోగొట్టడంలో వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని బియ్యం డబ్బాలో వేయండి. వెల్లుల్లిలో ఉండే 'అల్లిసిన్' అనే సమ్మేళనం నుంచి వచ్చే ఘాటైన వాసన కారణంగా.. ఆ బియ్యంలో ఉన్న పురుగులు పారిపోతాయి. అయితే మీరు డబ్బాలో వేసి వెల్లుల్లి కొన్ని రోజులకు ఎండిపోవచ్చు.. తర్వాత వాటిని మార్చి వేరేవి వేయండి.

ఎండు మిర్చి: బియ్యం స్టోర్ చేసేందుకు మన పూర్వికులు వాడిన మరో ప్రభావవంతమైన చిట్కా ఎండు మిర్చీ. మీరు 5 నుంచి 6 ఎండు మిర్చీని తీసుకొని బియ్యం డబ్బాలో వేయండి.మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ అనే ఘాటు సమ్మేళనం కారణంగా బియ్యంలో ఉండే పురుగులు నశించిపోతాయి. కొన్ని రోజుల తర్వాత వాటిని మార్చి మళ్లీ కొత్త మిర్చీని యాడ్ చేయండి.

దాల్చిన చెక్క: మన వంటకాల్లో ఎక్కవగా వాడే దాల్చిన చెక్కను ఉపయోగించి కూడా బియ్యంలో ఉన్న పురుగులను మనం ఈజీగా తరిమేయవచ్చు. ఇందుకోసం మీరు రెండు, మూడు దాల్చిన చెక్క ముక్కలను తీసుకొని మీ బియ్యం డబ్బాలో వేయండి. తర్వాత బియ్యం మొత్తాన్ని బాగా కలపండి. ఇలా చేయడం వల్ల దాల్చిచెక్క నుంచి వచ్చే ఘాటైన వాసనకు బియ్యంలో ఉన్న పురుగులు పారిపోతాయి. అలాగే ఎలాంటి కీటకాలు, లార్వాలు బియ్యం జోలికి రాకుండా ఉంటాయి.