చిన్నది లేదా పెద్దది.. ఏ కొబ్బరికాయలో ఎక్కువ నీరు ఉంటుంది? ఇలా సింపుల్‌గా తెలుసుకోండి!

Updated on: Apr 24, 2026 | 1:59 PM

Coconut Water: వేసవిలో బాడీని కూల్‌గా ఉంచుకునేందుకు నిమ్మరసం తర్వాత చాలా మంది కొబ్బరి నీళ్ళు తాగేందుకు ఇష్టపడుతారు. ఈ కాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్ళు చాలా బాగా ఉపయోగపడుతాయి. అయితే కొబ్బరికాయలు కొనేప్పుడు ఎక్కవ నీళ్లు ఉన్న కాయను గుర్తించడం అనేది పెద్ద టాస్క్. చాలా మంది పెద్దగా ఉండే కాయలో ఎక్కువ నీళ్లు ఉంటాయని భావిస్తారు. కానీ తీర కాయ కొట్టాక దాని పరిమాణానికి తగ్గట్టుగా నీరు అందులో అస్సలే ఉండవు. కాబట్టి ఎక్కవ నీళ్లు ఉన్న కొబ్బరి కాయను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

1 / 5
మీకు ఎక్కువ నీరు ఉన్న కొబ్బరికాయ కావాలంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎక్కవ పెద్దగా, మరీ చిన్నగా ఉన్న కాకుండా మధ్యస్థ పరిమాణంలో ఉన్న కొబ్బరికాయను ఎంచుకోవడం మంచిది. మరో విషయం ఏమిటంటే మీరు ఎంచుకునే కొబ్బరికాయ గుడ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే గుండ్రని కొబ్బరికాయలో ఎక్కువ నీరు ఉంటుంది. పొడవుగా లేదా అండాకారంలో కనిపించే కొబ్బరికాయలలో తరచుగా నీరు తక్కువగా ఉండొచ్చు.

2 / 5
శబ్దం ద్వారా నిజాన్ని గుర్తించండి: కేవలం కాయ సైజును బట్టి కాకుండా కొబ్బరికాయను మీ చెవికి దగ్గరగా తీసుకువచ్చి, మెల్లగా ఊపండి. మీకు పెద్దగా నీళ్లు కదులుతున్న శబ్దం వినిపిస్తే, కొబ్బరికాయలో నీరు తక్కువగా, గాలి ఎక్కువగా ఉందని అర్థం. నీరు ఎక్కువగా ఉన్న కొబ్బరికాయలలో లోపల ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది, కాబట్టి దానిని ఊపినప్పుడు శబ్దం చాలా తక్కువగా లేదా అస్సలు రాదు. కాబట్టి అలాంటి కాయలనే మీరు ఎంచుకోండి.

3 / 5
రంగును గుర్తించండి: రంగుబట్టి కూడా మీరు ఎక్కవ నీరు ఉన్న కాయను గుర్తించుకోవచ్చు. కొబ్బరికాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉన్నాయని అర్థం. చిప్పపై గోధుమ రంగు మచ్చలు ఉంటే, అది పాతదైందని, దానిలోని నీరు ఆవిరై మీగడలా మారిందని అర్థం. అందువల్ల, ఎల్లప్పుడూ పచ్చి కొబ్బరికాయనే ఎంచుకోండి.

4 / 5
కొబ్బరికాయ బరువు: బరువును బట్టి కూడా మంచి నీళ్లు ఉన్న కాయను గుర్తించవచ్చు. ఇందుకోసం ఒక కొబ్బరికాయను చేతిలోకి తీసుకోండి, దాని పరిమాణంతో పోలిస్తే బరువుగా ఎక్కువగా అనిపిస్తే, అది నీటితో నిండి ఉందని అర్థం. అలాగే, కొబ్బరికాయ పైభాగంలో మూడు గుర్తుల కోసం చూడండి. ఈ గుర్తులు గట్టిగా, నల్లగా ఉంటే, ఆ కొబ్బరికాయ పాతదని అర్థం.

5 / 5
కాబట్టి ఈ సమ్మర్‌లో కొబ్బరి కాయలను కొనే ముందు ఈ సింపుల్‌ చిట్కాలను తెలుసుకోండి. దీని ద్వారా మీరు అనవసరంగా డబ్బులు వృథా చేయకుండా కాపాడుకోవచ్చు. అలాగే మంచి నీళ్లు ఉన్న కొబ్బరి కాయను పొందడం వల్ల శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచుకోవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు)

Follow Us