
మీరు ముందుగా తలకాయ మాంసాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకుని పెట్టాలి. ఇంకా నీచు వాసన వస్తే ఉప్పుతో మళ్ళీ అడగండి. అయితే, వీటిని మంచిగా ఉడికించడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి, అది వేడయ్యాక ఉల్లిపాయలు ముక్కలు ముక్కలు, పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకును కూడా వేసి వేయించండి.

ఇక ఇప్పుడు ముందు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలకు మసాలాలను బాగా పట్టించి 20 నిముషాల పాటు కుక్కర్ లో బాగా ఉడికించండి.

మధ్యలో తలకాయ ముక్కలు ఉడికాయ లేదా అని గరిటేతో చూడండి. అవి ఉడికిన తర్వాత దానిలో పసుపు, ఉప్పు, అన్ని రకాల మసాలా పొడులు వేసి నూనె తేలే వరకు బాగా వేయించండి. అంతే వేడి వేడి తలకాయ కూర రెడీ.

మేక తలకాయ కూర అందరికి మంచిది. అంతే కాదు, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.