
కావాల్సిన పదార్దాలు: 5 ఉడికించిన కోడిగుడ్లు, ఒక కప్పు చింత చిగురు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకును తీసుకోవాలి

ముందుగా స్టవ్ వెలిగించి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేయించండి. ఆ తర్వాత దీనిలో సన్నగా ఉల్లిపాయలు ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.

ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి వాటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా చింత చిగురును వేసి మగ్గే వరకు నూనెలో బాగా వేయించాలి.ఆ తర్వాత దానిలో రెండు 5 ఉడికించిన గుడ్లను ముక్కలు చేసిన కానీ లేదా కార్చిన కూడా కూర రుచిగానే ఉంటుంది.

చింత చిగురు మసాలాలు గుడ్లకు పట్టే వరకు 10 నిమిషాల పాటు మీడియం మంటపై అలాగే వేయించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి చింత చిగురు ఎగ్ మసాలా కర్రీ రెడీ.