Soft Idli: రుబ్బేటప్పుడు పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు.. ఇంట్లోనే స్పాంజ్‌ లాంటి ఇడ్లీలు రెడీ!

Updated on: Sep 24, 2026 | 3:45 PM

Soft Idli Making Tips: మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏమి తింటున్నామనే దాన్ని బట్టే.. ఆ డే మొత్తం మన ఎలా ఉంటామనేది ఆదారపడి ఉంటుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ ఆహారం అంటే తొలుత గుర్తొచ్చేది ఇడ్లీ.మరీ మీరు రోజూ తినే ఇడ్లీ బోర్ కొట్టి ఉంటే.. ఈ సారి కొత్తగా పోషకాలతో కూడిన రాగి ఇడ్లీని ట్రై చేయండి. ఇది టేస్ట్‌తో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

1 / 5
సాధారణంగా నార్మల్‌ ఇడ్లీలను బియ్యం, ఇడ్లీ రవ్వతో చేస్తారు. కానీ రాగి ఇడ్లీలను రాగి పిండితో చేయడం వల్ల అవి మరింత ఆరోగ్యంగా ఉంటాయి. రాగుల్లో  ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలకు, వృద్ధులకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచివి. వీటిని కూడా నార్మల్ ఇడ్లీల్లానే ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసం రాగి పిండిని కాసేపు నానబెట్టి, రుబ్బి, పులియబెడితే చాలు. మరుసటి రోజు ఉదయానికి వేడి వేడి ఇడ్లీలు తయారవుతాయి.

2 / 5
 రాగి ఇండ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి – 1 కప్పు , ఇడ్లీ బియ్యం – 1 కప్పు , మినపప్పు – అర కప్పు , మందపాటి అటుకులు – అర కప్పు , మెంతులు – అర టీస్పూన్ , ఉప్పు – రుచికి సరిపడా , నీళ్లు – పిండి రుబ్బడానికి తగినన్ని ఇవి ఉంటే చాలు మీరు ఇంట్లోనే ఈజీగా రాగి ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు.

3 / 5
తయారీ విధానం: ఇంట్లో రాగి ఇడ్లీలు చేసుకునేందుకు ముందుగా ఒక గిన్నెలో బియ్యం, అటుకులు కడిగి తగినన్ని నీళ్లు పోసి 4–5 గంటలు నానబెట్టండి. మరో గిన్నెలో మినపప్పు, మెంతులు కడిగి అదే విధంగా 4–5 గంటలు నానబెట్టండి. అటుకులు కలపడం ద్వారా ఇడ్లీలు సాఫ్ట్‌గా చాలా మృదువుగా వస్తాయి.

4 / 5
ఇప్పుడు నానబెట్టిన మినపప్పు, మెంతులను కొద్దిగా నీళ్లు పోసి వెన్నలా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం, అటుకులను ఇడ్లీ రవ్వలా కాస్త బరకగా రుబ్బుకొని.. ఆ రెండింటినీ ఒకే గిన్నెలో పోసి బాగా కలపండి. తర్వాత రుబ్బిన పిండిలో 1 కప్పు రాగి పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తర్వాత గిన్నెపై మూత పెట్టి వెచ్చని ప్రదేశంలో రాత్రంతా లేదా 8–10 గంటల పాటు ఉంచండి. మరుసటి రోజు ఉదయానికి పిండి బాగా పులుస్తోంది.

5 / 5
ఇక మార్నింగ్ లేవగానే పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. దాన్ని కాసేపు అలానే పెట్టి.. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి చేయండి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, పిండిని నింపండి. వాటిని మీడియం ప్లేమ్‌లో 10–12 నిమిషాలు ఆవిరి మీద ఉంచి..తర్వాత టూత్‌పిక్‌తో గుచ్చి చూడండి, దానికి పిండి అంటుకోకపోతే ఇడ్లీలు సిద్ధమైనట్లే. అంతే వాటిని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని చెట్నీతో తింటే.. ఆ టేస్ట్‌ ఏ వేరు!

Loading...
Unable to load recommendations.
Follow Us