ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే ఇంట్లో వాళ్ళు గిన్నె కూడా వదలరు.. రుచి అదిరిపోద్ది!

Updated on: Feb 27, 2026 | 7:30 PM

మనం ఇప్పటి వరకు చికెన్ తో ఎన్నో వంటకాలు చేసుకుని తిన్నాము. కానీ ధాబా స్టైల్లో మీరు ఇప్పటి వరకు చేసుకుని తిని ఉండరు. ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే ఇమి ఇంట్లో వాళ్ళు ప్లేట్ కూడా వదలకుండా తింటారు. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావల్సిన పదార్దాలు: అర కిలో చికెన్, రెండు కప్పులు పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గసగసాలు, 
ఉల్లిపాయలు, టమోటాలు, నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

కావల్సిన పదార్దాలు: అర కిలో చికెన్, రెండు కప్పులు పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గసగసాలు, ఉల్లిపాయలు, టమోటాలు, నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
ముందుగా చికెన్‌ ఒక గిన్నెలోకి తీసుకుని దానికి రెండు కప్పులు పెరుగు, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్  కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  కొద్దిగా ఉప్పు 40 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి బంగారు రంగులోకి మారే వరకు దాని మీదే ఉంచండి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి బంగారు రంగులోకి మారే వరకు దాని మీదే ఉంచండి.

4 / 5
ముక్కలు ఉడికిన తర్వాత టమోటా ముక్కలు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, మసాలా పొడి, గసగసాలు వేసి స్టవ్ మీదే ఉంచండి.

ముక్కలు ఉడికిన తర్వాత టమోటా ముక్కలు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, మసాలా పొడి, గసగసాలు వేసి స్టవ్ మీదే ఉంచండి.

5 / 5
ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్‌ను ఈ మిశ్రమంలో వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మీడియం మంట పై 20 నిముషాల పాటు 
స్టవ్ మీదే ఉంచండి. కూర చివర్లో కొత్తిమీర వేసి దించేయండి. అంతే, వేడి వేడి  ధాబా స్టైల్ పెరుగు చికెన్ రెడీ.

ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్‌ను ఈ మిశ్రమంలో వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మీడియం మంట పై 20 నిముషాల పాటు స్టవ్ మీదే ఉంచండి. కూర చివర్లో కొత్తిమీర వేసి దించేయండి. అంతే, వేడి వేడి ధాబా స్టైల్ పెరుగు చికెన్ రెడీ.

Follow Us