
కొందరికి సండే రోజున ఏదొక నాన్ వెజ్ ఉండాల్సిందే ఇక ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్ లేదా మటన్ తెచ్చుకుని తింటూనే ఉంటారు. చికెన్ కొన్ని నిముషాల్లోనే అయిపోతోంది కానీ, మటన్ అలా కాదు చాలా సమయం పడుతుంది. ఇక ముదురు మటన్ అయితే తొందరగా ఉడకదు. ఈ పాతకాలపు చిట్కాలతో మటన్ ఫాస్ట్ గా ఉడకాలంటే ఇవి పాటించండి.

ముందుగా మీరు మటన్ ఇంటికి తెచ్చిన వెంటనే చల్లటి నీళ్ళతో కాకుండా గోరు వెచ్చటి నీళ్లతో కడగండి. ఇలా కడిగితే ఫాస్ట్ గా ఉడుకుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం మీరు వండేటప్పుడు మాంసం ముదురుదా? లేక లేత మాంసమా అనేది చూసుకుని వాటిని కుకింగ్ చేయడం మొదలు పెట్టండి కొన్ని తప్పులు చేస్తే మటన్ ను తొందరగా ఉడకనివ్వదు.

ముదురు మటన్ అయితే పసుపుతో బాగా కడిగిన ఆ తర్వాత పెరుగు, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నుంచి 6 గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇంకా కూర ఉడికే సమయంలో రెండు టీ స్పూన్ ఆయిల్ వేస్తే బాగా ఉడుకుతుంది. ఇలా చేస్తే ఎంతటి ముదురు మాంసం 10 నిముషాల్లోనే మెత్తగా అవుతుంది

లేత మటన్ మెత్తగా ఉడకాలంటే.. ఇంట్లో ఉండే కొన్ని పదార్దాలతో సులభంగా ఉడికించవచ్చు. మీరు షాప్ నుంచి మటన్ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే నాలుగు నుంచి ఐదు సార్లు మటన్ శుభ్రం చేసుకోవాలి. లేత మటన్ అయితే, నిమ్మరసంలో 10 నిముషాల పాటు నానబెట్టాలి. ఇలా చేస్తే మటన్ ఉడకకముందే మెత్తగా అవుతుంది.

ఇంకా ఈ మేక మాంసం ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని చోట్ల ముదురుగా ఉంటే, మరి కొన్ని ప్రదేశాల్లో చాలా లేతగా ఉంటుంది. లేతది తెచ్చినా కూడా పెద్ద సమస్య కాదు. ఇక ముదురుది అయితే ఉడకడానికి కొంత సమయం పడుతుంది. ఈ చిట్కాలను పాటిస్తే ఎలాంటి మాంసం 10 నిముషాల్లోనే ఉడుకుతుంది.