
ఆదిమానవుల ఎగ్ రెసిపీ గురించి కొత్తగా వింటున్నారా, కానీ ఇది చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే, దీనిని చేయడానికి నిప్పులు లేదా పొయ్యిని సిద్ధం చేసుకోవాలి.

ముందుగా కోడి గుడ్లను తీసుకుని నిప్పులపై 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తెల్లగా ఉన్న పెంకులు నల్లబడిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.

కాలిన గుడ్లను తీసుకుని కోడిగుడ్లు, టమాటా కూర ఎలా వండుకుంటారో అదే రెసిపీని ఫాలో అయ్యి చేసుకుని తినడమే.

నిప్పుల్లో బాగా కాలిన గుడ్డును తీసుకుని, వాటి పెంకులను బ్రేక్ చేసి గుడ్డును బయటకు తీయండి. ఇంకా రుచిగా చేసుకోవాలనుకుంటే టమాటాలు, ఉల్లిపాయలు వేసుకుని కూర లాగా చేసుకుని తింటే టేస్టీ గా ఉంటుంది.

అయితే, కొందరు ఈ రెసిపీని వేరేలాగా కూడా చేస్తారు. ముందు కోడి గుడ్లను తీసుకుని దానికి మట్టి రాసి నిప్పుల్లో కాల్చుతారు. ఇలా చేస్తే గుడ్డు లోపల బాగా ఉడుకుతుందని నమ్ముతారు. ఆ తర్వాత దానిని తీసి అప్పటికప్పుడు తినేస్తారు.