కోసే కొద్ది పెరుగుతుంది.. ఇలా చేస్తే కట్టల కట్టల తోటకూర ఇంట్లోనే పండించొచ్చు.

Updated on: May 14, 2026 | 9:42 AM

ఆకుకూరల్లో తోటకూర పెంపకం అత్యంత సులభమైనది, వేగవంతమైనది. విత్తనం నాటిన దగ్గర నుంచి కేవలం 30 రోజుల్లోనే ఇది కోతకు వస్తుంది. ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో సులభంగా పెంచుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. కాబట్టి ఇంట్లోనే తోటకూరను విత్తనం నుండి హార్వెస్ట్ చేసే వరకు ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
తోటకూర పెంపకానికి పెద్ద లోతు అవసరం లేదు, ఒక చిన్న బాస్కెట్ లేదా వెడల్పాటి కుండీ సరిపోతుంది. ముందుగా, చిల్లులున్న ఒక చిన్న బాస్కెట్‌లో గార్డెన్ సాయిల్ వేసి దాన్ని తడపాలి. తోటకూర విత్తనాలు చాలా చిన్నవిగా, నల్లటి కళ్లలా ఉంటాయి. వీటిని నేరుగా చల్లడం కష్టమైతే, కొద్దిగా పొడి మట్టిలో కలిపి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. విత్తనాలు చల్లిన తర్వాత, వాటిపై 1/4 అంగుళం మందాన మట్టిని కప్పి, నెమ్మదిగా నీళ్లు పోయాలి. ఆ తర్వాత, కుండీని లేదా బాస్కెట్‌ను ఎండ తగిలే చోట ఉంచాలి. మట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిబారకుండా జాగ్రత్త వహించాలి.

2 / 5
మొలకలు, మొక్కల మార్పిడి: సుమారు 7 నుండి 10 రోజులలోపు విత్తనాలు మొలకెత్తుతాయి. 10 నుండి 15 రోజుల లోపు మొదటి సెట్ ఆకులు కొద్దిగా బలంగా కనిపిస్తాయి. ఈ దశలో మొక్కలను మార్పిడి చేయాలి. ఒకే చోట ఎక్కువ మొక్కలు ఉంటే, అవి ఓవర్‌క్రౌడ్ అయి సరిగా పెరగవు లేదా గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. మార్పిడి చేసేటప్పుడు, మొక్కకు మొక్కకు 4 నుండి 5 అంగుళాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

3 / 5
తెగుళ్ల నివారణ: తోటకూరను పెంచడానికి ప్రత్యేకంగా ఏ ఫెర్టిలైజర్లు అవసరం లేదు. ఆకుకూరలు ఆకుపచ్చగా, ఆరోగ్యంగా పెరగాలంటే మట్టిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండాలి. గార్డెన్ సాయిల్‌లో కంపోస్టు, మ్యాన్యూర్ వంటి సేంద్రీయ పదార్థాలను కలపడం మంచిది. కొద్దిగా ఒక చెంచాడు ఎప్సమ్ సాల్ట్ వేస్తే తోటకూర చాలా ఆరోగ్యంగా, చక్కగా ఆకుపచ్చగా పెరుగుతుంది. ఒకవేళ గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంటే, కొద్దిగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ని నీళ్లలో కలిపి వేసుకోవచ్చు.

4 / 5
ప్రయోజనాలు: మొక్కలు నాటిన దాదాపు 15 రోజుల తర్వాత, అవి కోతకు సిద్ధంగా ఉంటాయి. 30 రోజుల్లోపు మనం మొదటి కోతను హార్వెస్ట్ చేసుకోవచ్చు. కోత సమయంలో, కాండాలను సగం వరకు కట్ చేసుకుంటే, పక్కనుంచి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి పెరుగుతాయి. విత్తనాలను సేకరించాలనే ఆసక్తి ఉంటే, కొన్ని మొక్కలను అలాగే పెంచి వాటి నుండి విత్తనాలను సేకరించవచ్చు.

5 / 5
తోటకూర విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉండే అత్యంత పోషక విలువలున్న ఆకుకూర. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్‌లు సమృద్ధిగా కలిగి ఉంటుంది. అయితే బయట మార్కెట్‌లో దొరికే ఆకు కూరలు రసాయనాలు వాడి పెంచుతున్న నేపథ్యంలో మీరు ఈ పద్ధతులను అనుసరించి ఇంట్లోనే సులభంగా తోటకూరను పండించుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Follow Us