బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. అరటిపండుతో అదిరే అందం.. ఇలా చేస్తే ముఖం మిలమిల మెరిసిపోవాల్సిందే..

Updated on: Apr 20, 2026 | 5:06 PM

అందమైన, మొటిమలు లేని చర్మం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కానీ నేటి కాలుష్యం, దుమ్ము, ఎండల వల్ల ముఖంపై ముడతలు, మొటిమలు, పొడిబారడం వంటి సమస్యలు సహజమైపోయాయి. వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడడం లేదా బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు. అయితే అవి చర్మానికి మేలు చేయడం కంటే రసాయనాల వల్ల కీడే ఎక్కువ చేస్తాయి. ఇలాంటి సమయంలో అరటిపండు అద్భుతమైన వరప్రసాదంలా పనిచేస్తుంది.

1 / 5
అరటిపండును చర్మ సంరక్షణలో ప్రకృతి సిద్ధమైన బొటాక్స్ అని పిలుస్తారు. ఇందులో చర్మానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని విటమిన్ ఎ చర్మంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించి, రంగును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పొటాషియం పొడిబారిన చర్మానికి తగినంత తేమను అందించి, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు.

అరటిపండును చర్మ సంరక్షణలో ప్రకృతి సిద్ధమైన బొటాక్స్ అని పిలుస్తారు. ఇందులో చర్మానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని విటమిన్ ఎ చర్మంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించి, రంగును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పొటాషియం పొడిబారిన చర్మానికి తగినంత తేమను అందించి, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు.

2 / 5
యవ్వనంగా కనిపించాలా: వయసు పెరిగే కొద్దీ చర్మం సాగిపోయి ముడతలు రావడం సహజం. దీనిని అరికట్టడానికి అరటిపండు, పెరుగు కలయిక ఒక అద్భుతం. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మ రంధ్రాల్లోని మలినాలను తొలగిస్తుంది. అరటిపండును మెత్తగా చేసి పెరుగుతో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆపై గోరువెచ్చని నీటితో కడగండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది.

3 / 5
మొటిమలు, మచ్చల నుండి విముక్తి: మొటిమలు మానిపోయినా, అవి మిగిల్చే మచ్చలు ముఖం అందాన్ని దెబ్బతీస్తాయి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఈ రెండింటిని బాగా కలిపి ముఖంపై సమానంగా పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి. ఇది చర్మంపై ఉన్న ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి సహజ సిద్ధమైన మెరుపును ఇస్తుంది.

4 / 5
పొడి చర్మానికి పోషణ: చర్మం పొడిబారి, పొలుకులుగా ఊడిపోతుంటే అరటిపండులోని సహజ నూనెలు రక్షణగా నిలుస్తాయి. ఇది చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరిచి పోషణను అందిస్తుంది. అరటిపండు గుజ్జుకు కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలిపి వాడితే ఫలితం ఇంకా మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా అరటి తొక్క లోపలి భాగంతో ముఖంపై మెల్లగా మసాజ్ చేస్తే, మొటిమలు త్వరగా తగ్గుతాయి. అంతేకాకుండా కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

5 / 5
జాగ్రత్తలు - సూచనలు: ఈ ఫేస్ మాస్క్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కెమికల్ ఉత్పత్తులు వాడిన వెంటనే వీటిని వాడొద్దు. ఎల్లప్పుడూ తాజా పండ్లనే ఉపయోగించండి. అందమైన చర్మం అనేది ఖరీదైన సీరమ్స్‌లో ఉండదు, మనం చేసే క్రమబద్ధమైన సంరక్షణలో ఉంటుంది. ప్రకృతి ఇచ్చిన ఈ వరాన్ని ఉపయోగించి మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోండి..

Follow Us