Shaving Mistakes: పర్ఫెక్ట్ క్లీన్ షేవ్ కావాలా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

Updated on: Jun 15, 2026 | 8:19 PM

మనం ముఖం, నీట్‌గా, క్లీన్‌గా కనిపించాలంటే.. షెవింగ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు కేవలం ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే షేవింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరికి వారు ఇంట్లోనే షేవ్ చేసుకుంటారు. కొందరు రోజూ షేవ్ చేసుకుంటే మరికొందరు వారానికోసారి చేసుకుంటారు. అయితే ఇలా షేవింగ్ చేసే సమయంలో చేసే చిన్న తప్పుల కారణంగా ముఖంపై గీతలు పడడం, ఇన్షెక్షన్ అవ్వడం అవుతుంది. అలాంటప్పుడు మనం చేసే ఆ తప్పులు ఏంటి అని తెలుసుకొని వాటిని నివారించడం చాలా ముఖ్యం. కాబట్టి ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
షేవింగ్ చేసుకోవడం అనేది ప్రతి పురుషుడి రోజువారి లైఫ్‌లో ఒక భాగం. స్మార్ట్ అండ్ నీట్‌గా కనిపించేందుకు కొందరు రోజూ షేవింగ్ చేస్తే.. మరికొందరు వారానికోసారి.. మరి కొందరు నెలకోసారి చేసుకుంటారు. చాలా మందికి సరైన అవాగాహన లేక షేవింగ్ చేసుకునేప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. ఇలా చేయడం వల్ల ముఖంపై గాయాలు ఏర్పడడం, లేదా ఇన్‌ఫెక్షన్స్ అవ్వడం అవుతాయి. కాబట్టి వీటిని నివారించాలంటే.. మనం సేఫ్‌గా ఎలా షేవ్ చేసుకోవాలో తెలుసుకోవాలి

2 / 5
చాలా మంది ఆఫీస్‌కు లేట్ అవుతుందనో.. లేదా ఇంకేదో పనులు ఉన్నాయో.. స్నానం చేసే ముందు ముఖం కడుక్కోకుండా త్వర త్వరగా షేవింగ్ చేసుకుంటారు. కానీ ఇలా ముఖం శుభ్రం చేసుకోకుండా షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా మన రక్తంలో కలిసి చర్మంలోకి వెళ్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్, అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి షేవింగ్‌ ముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోకండి.

3 / 5
కొందరు గతంలో వాడిన రేజర్‌నే మళ్లీ మళ్లీ వాడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల షేక్ చేసుకునేప్పుడు చర్మంపై గీతలు పడడం,  లేదా గాయాలు కావచ్చు. అంతేకాదు.. అప్పటికే యూజ్ చేసిన రేజర్లలో బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. మళ్లీ దాన్నే యూజ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా కారణంగా ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.కాబట్టి ప్రతి షేవింగ్‌ తర్వాత బ్లేడ్‌ను మార్చండం మంచిది. అలాగే షేక్ చేసిన తర్వాత రేజర్‌ను పూర్తిగా శుభ్రం చేసి ఆరబెట్టడం మంచిది.

4 / 5
కొందరు ఎలాంటి లూబ్రికేషన్ లేకుండా ఖాళీ రేజర్‌తోనే షేవింగ్ చేసుకుంటారు. ఇలా చేసుకోవడాన్ని డ్రై షేవింగ్ అంటారు. కానీ ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. ఇది చికాకు, దద్దుర్లు, కోతలకు కూడా కారణం కావచ్చు. కాబట్టి బ్లేడ్ చర్మంపై ఫ్రీగా కదిలేందుకు,  చర్మానికి ఎలాంటి గాయాలు అవ్వకుండా ఉండాలంటే.. కచ్చితంగా  ఫోమ్ లేదా జెల్‌ను ఉపయోగించి షేవింగ్ చేసుకోండి.

5 / 5
చాలా మంది షేవింగ్ చేసుకున్నాక.. నార్మల్‌గా వాష్ చేసి వదిలేస్తారు. కానీ షేవింగ్ చేసుకున్నాక చర్మం పొడిగా, సున్నితంగా మారుతుంది. అలాంటప్పుడు మీరు మాయిశ్చరైజ్ చేయకపోతే అది పొడిబారడం, దద్దుర్లు రావడానికి కారణం కావచ్చు. కాబట్టి షేవ్ తర్వాత ఆల్కహాల్ లేని ఆఫ్టర్ షేవ్ బామ్ లేదా మాయిశ్చరైజర్‌ను వాడండి. ఇది చర్మాన్ని శాంతింపజేస్తుంది.

Follow Us