90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్.. ఇలా చేస్తే చెత్త మొత్తం వదలాల్సిందే..

Updated on: Aug 16, 2026 | 5:16 PM

వాషింగ్ మెషీన్ నుంచి బట్టలు తీశాక బ్యాడ్ స్మెల్ వస్తుందా? డ్రమ్ లోపల మురికి పేరుకుపోయిందా? చాలామంది వాషింగ్ మెషీన్ వాడటమే తప్ప దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా బాల్కనీల్లో ఉంచే మెషీన్లు మరింత త్వరగా పాడవుతాయి. అయితే కిచెన్‌లో దొరికే కొన్ని సాధారణ వస్తువులతోనే మెషీన్ మురికిని చిటికె ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం..

1 / 5
మెషీన్ బయటి భాగమే కాకుండా లోపలి డ్రమ్‌లో కూడా రోజువారీ ఉతుకుల వల్ల డిటర్జెంట్ అవశేషాలు, గార, నీటి మలినాలు భారీగా పేరుకుపోతాయి. దీనివల్ల బట్టల నుంచి దుర్వాసన రావడం, మెషీన్ పనితీరు మందగించడం జరుగుతుంది. అయితే ప్రతీసారీ వేల రూపాయలు ఖర్చు చేసి టెక్నీషియన్‌ను పిలవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే వాషింగ్ మెషీన్‌ను కొత్తదానిలా క్లీన్ చేసుకోవచ్చు.

2 / 5
వెనిగర్ - బేకింగ్ సోడా మ్యాజిక్: డ్రమ్‌లో పేరుకుపోయిన మొండి మురికి, ఉప్పు నీటి గారను తొలగించడానికి వెనిగర్, బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తాయి. ముందుగా డ్రమ్‌లో రెండు కప్పుల వెనిగర్ పోసి, అధిక ఉష్ణోగ్రత సైకిల్‌లో మెషీన్‌ను రన్ చేయాలి. ఆ తర్వాత అర కప్పు బేకింగ్ సోడా వేసి మరోసారి సాధారణ సైకిల్‌ను నడపాలి. వెనిగర్, బేకింగ్ సోడాలోని సహజ గుణాలు డ్రమ్‌లోని బ్యాక్టీరియా, బూజును పూర్తిగా నిర్మూలిస్తాయి.

3 / 5
వేడి నీరు - సెల్ఫ్-క్లీన్ మోడ్: ఆధునిక వాషింగ్ మెషీన్లలో ఉండే టబ్ క్లీన్ లేదా సెల్ఫ్ క్లీనింగ్ ఆప్షన్‌ను నెలకు కనీసం ఒకసారి ఉపయోగించాలి. ఇందుకోసం వేడి నీటితో పాటు కాస్త డిటర్జెంట్ లేదా క్లీనింగ్ పౌడర్ వేసి సెల్ఫ్ క్లీన్ మోడ్‌ను రన్ చేస్తే అంతర్గత పైపులు, డ్రమ్ వెనుక భాగంలోని చెత్త పూర్తిగా కొట్టుకుపోతుంది.

4 / 5
రబ్బర్ గాస్కెట్ల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్: ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ మెషీన్లలో తలుపు వద్ద ఉండే రబ్బర్ గాస్కెట్లు, జాయింట్ల వద్ద బూజు, నాచు, గ్రీజు పేరుకుపోతాయి. వీటిని శుభ్రం చేయడానికి నీటిలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి, ఆ ద్రావణంలో ముంచిన మెత్తటి క్లాత్‌తో రబ్బర్ అంచులను బాగా తుడవాలి. ఇది దుర్వాసనను దూరం చేయడంతో పాటు క్రిములను నశింపజేస్తుంది.

5 / 5
నిమ్మరసంతో తాజా సువాసన - రక్షణ: నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మొండి మరకలను తొలగించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. రెండు నిమ్మకాయల రసాన్ని డ్రమ్‌లో పిండి, కాటన్ గుడ్డతో డ్రమ్ లోపలి భాగాన్ని తుడిస్తే మెషీన్ మెరవడమే కాకుండా తాజా సువాసన వస్తుంది. మెషీన్ ఎక్కువ కాలం మన్నాలంటే వాడకం తర్వాత తలుపును కాసేపు తెరిచి ఉంచడం, బాల్కనీలో ఉన్నప్పుడు వాటర్‌ప్రూఫ్ కవర్‌ను వాడటం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us