
చలికాలం వచ్చిందంటే చాలు ఇళ్లలో దుప్పట్లను బయటకు తీసి వాడుకోవడానికి సిద్ధం చేస్తారు. అయితే, బరువైన దుప్పట్లు, రగ్గులను ఉతకాలంటే చాలా కష్టం. వాటిని ఒక్కసారి నీటిలో వేస్తే లేపడానికి కూడా చాలా కష్టం. తేలికైన దుప్పట్లను వాషింగ్ మెషీన్‌లో లేదా చేతితో సులభంగా ఉతకవచ్చు, కానీ మందమైన, బరువైన దుప్పట్లను డ్రై క్లీనింగ్ కోసం ఇస్తే జేబుకు చిల్లే.. కానీ మీకు కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు తెలిస్తే మీ దుప్పటిని ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు. అవును, కుక్కర్ మూతను ఉపయోగించి ఇంట్లోనే దుప్పటిని ఎలా శుభ్రం చేయాలో చూద్దాం.

@Sangeetatyagivlogs అనే యూట్యూబ్ ఛానెల్ వీడియో ప్రకారం.. ముందుగా ఒక గిన్నెలో 1 టీస్పూన్ టాల్కమ్ పౌడర్, 2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ఒకవేళ దుప్పటి పెద్దగా ఉంటే, ఈ మిశ్రమాన్ని కొంచెం ఎక్కువగా కలుపుకోవచ్చు. తర్వాత దుప్పటిని లేదా రగ్గును నేలపై పూర్తిగా పరచండి. ఒక జల్లెడను ఉపయోగించి, ఆ మిశ్రమాన్ని దుప్పటిపై సమానంగా చల్లండి. తేమ, దుర్వాసనలను పీల్చుకోవడానికి దానిని 15 నుండి 20 నిమిషాల పాటు వదిలేయండి.

20 నిమిషాల తర్వాత శుభ్రమైన గుడ్డతో దుప్పటిని మెల్లగా రుద్దండి. దీనివల్ల పేరుకుపోయిన దుమ్ము, మురికి వదులవుతాయి. తరువాత, ఒక పెద్ద గిన్నెలో నీళ్లు నింపి, అందులో కొద్దిగా షాంపూ కలపండి. మీకు ఇష్టమైతే ఫ్యాబ్రిక్ కండిషనర్ కూడా ఉపయోగించవచ్చు. ఈ ద్రావణంలో ఒక శుభ్రమైన కాటన్ టవల్‌ను నానబెట్టి, నీరు లేకుండా బాగా పిండేసి పక్కన పెట్టుకోండి.

కుక్కర్ మూత సహాయంతో శుభ్రం చేయడం: ఇప్పుడు తడి టవల్‌ను కుక్కర్ మూతకు లేదా ఏదైనా చదునైన మూతకు గట్టిగా చుట్టండి. ఇప్పుడు ఆ మూత సహాయంతో దుప్పటిపై గుండ్రంగా రుద్దండి. ఇలా చేయడం ద్వారా దుమ్ము, దుర్వాసనలు తగ్గడంలో సహాయపడుతుంది. ఇలా మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. అయితే ప్రతిసారీ మీరు టవల్‌ను శుభ్రమైన నీటిలో పిండాలి. ఎందుకంటే దుప్పటికి ఉన్న మురికి టవల్‌కు అంటుకుంటుంది.

చివరగా దుప్పటి మొత్తం శుభ్రపరిచాక దాన్ని కాసేపు ఎండలో ఆరబెట్టాలి. ఒకవేళ ఎండ లేకపోతే ఇంట్లోనే ఫ్యాన్ కింద కూడా మీరు వాటిని ఆరబెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దుప్పటిలోని తేమ తొలగిపోయి, అది తాజాగా అనిపిస్తుంది.NOTE: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 ధృవీకరించడం లేదు.