Purity Test: షాప్‌లకు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా బంగారం, వెండి ఫ్యూరిటీని చెక్‌ చేసుకోండి!

Updated on: Jun 06, 2026 | 9:02 PM

ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ రాజ్యమేలుతోంది. తినే ఆహార పదార్థాలను మొదలు కొని మనం వాడే ఆభరణాల వరకు అన్నింటిని కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ కల్తీలను గుర్తించేందుకు సోషల్‌ మీడియాలో వచ్చే చిట్కాలను చాలా మంది ఫాలో అవుతుంటారు. కానీ ఇవి నిజంగానే పనిచేస్తాయా? వీటి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
బంగారం, వెండి, దేశీ నెయ్యి, ఆవనూనె.. ఇవి ప్రతి భారతీయ ఇంట్లోనూ ఉండే వస్తువులు. కానీ మార్కెట్‌లో పెరుగుతున్న కల్తీల కారణంగా మనం కొనే వస్తువు 100 శాతం అసలైందో కాదో గుర్తించడం కష్టంగా మారింది. ప్రజలు తరచూ సోషల్ మీడియాలో చూసో లేదా పెద్దల ద్వారా వినో రకరకాల ఇంటి చిట్కాలను ప్రయత్నించి వాటి ప్యూరిటీని చెక్‌ చేస్తూ ఉంటారు. ఐస్ ముక్కతో వెండిని గుర్తించవచ్చని కొందరు చెబితే, అయస్కాంతంతో బంగారాన్ని పరీక్షించవచ్చని మరికొందరు అంటారు. అయితే, ఈ చిట్కాల వెనుక ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా లేక ఇవన్నీ కేవలం ప్రచారంలో ఉన్న మాటలేనా? అనేది చూద్దాం.

2 / 5
సైన్స్, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వీటిలో కొన్ని పరీక్షలు పూర్తిగా ఖచ్చితమైనవి కాగా, మరికొన్నింటి వెనుక ఉన్న లాజిక్ కాస్త భిన్నంగా ఉంటుంది. చాలామంది బంగారు ఆభరణాలపై అయస్కాంతాన్ని ఉంచి చూస్తారు. ఆభరణం అయస్కాంతానికి అంటుకోకపోతే అది 100శాతం అసలైన బంగారమని నమ్ముతారు. ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (IGI,) మెటల్ నిపుణుల ప్రకారం, ఈ మాట శాస్త్రీయంగా చాలా వరకు నిజమే. స్వచ్ఛమైన బంగారం ఒక నాన్-మాగ్నెటిక్ మెటల్ అంటే దీనికి అయస్కాంత గుణాలు అస్సలు ఉండవు.

3 / 5
ఒకవేళ మీ బంగారు గొలుసు లేదా ఉంగరం అయస్కాంతానికి అతుక్కుంటే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి చౌకైన, బరువైన లోహాలను కలిపారని అర్థం. అయితే, ఈ పరీక్ష పూర్తిగా నమ్మదగినది కాదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగారంలో రాగి లేదా ఇత్తడి వంటి వాటిని కలిపినా కూడా అది అయస్కాంతానికి అంటుకోదు. కాబట్టి బేస్ లోహాల కల్తీని గుర్తించడానికి అయస్కాంత పరీక్ష ఉపయోగపడినప్పటికీ, పూర్తి స్వచ్ఛతను తెలుసుకోవడానికి హాల్‌మార్క్ చూడటమే అత్యుత్తమ మార్గమని చెబుతున్నారు.

4 / 5
వెండి, ఐస్ ముక్కకు ఉన్న అసలు కనెక్షన్ ఏంటి?: అసలైన వెండి ఐస్ ముక్కకు అంటుకుంటుందని ఒక అపోహ ఉంది. కానీ జ్యువెలరీ నిపుణులు, శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, దీని వెనుక ఉన్న అసలు లాజిక్ అంటుకోవడం కాదు, ఐస్ ముక్క చాలా వేగంగా కరిగిపోవడం. ప్రపంచంలోనే అత్యధిక థర్మల్ కండక్టివిటీ కలిగిన లోహంగా వెండిని పరిగణిస్తారు. అంటే ఇది వేడిని లేదా చల్లదనాన్ని చాలా వేగంగా వేరు చేస్తుంది.

5 / 5
మీరు అసలైన వెండి నాణెం లేదా ఆభరణంపై ఒక ఐస్ ముక్కను ఉంచితే, అది ఏదో వేడి పెనంపై లేదా నేరుగా మంటపై పెట్టినట్లు చాలా వేగంగా కరగడం ప్రారంభిస్తుంది. ఒకవేళ ఐస్ ముక్క సాధారణ వేగంతోనే కరుగుతుంటే, ఆ వెండిలో ఇతర చౌకైన లోహాల కల్తీ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. వెండి స్వచ్ఛతను పరీక్షించే ఈ ఇంటి చిట్కా సైన్స్ పరంగా పూర్తిగా నిజమని రుజువైంది. కాబట్టి ఈ చిట్కాలు కొంత వరకు వాస్తవమేనని చెబుతున్నారు.

Follow Us