హోటల్ రూమ్‌లో ఈ ఒక్క వస్తువును అస్సలు వాడకండి.. ఈ భయంకరమైన నిజం తెలుసా..?

Updated on: Jun 30, 2026 | 5:18 PM

Hotel Room Secrets: ప్రయాణాల్లో ఆరోగ్యం అత్యంత ముఖ్యం. అన్ని హోటళ్లు ఒకేలా ఉండకపోయినా, మన జాగ్రత్తలో మనం ఉండటం ఎప్పుడూ శ్రేయస్కరం. కాబట్టి, వచ్చే సారి మీరు ఏదైనా హోటల్ రూమ్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఉండే ఎలక్ట్రిక్ కెటిల్‌ను నేరుగా వాడకుండా, నిపుణులు చెప్పినట్లు ఒకసారి శుభ్రం చేసుకున్నాకే ఉపయోగించండి.

1 / 5
టూరిజం కోసమో లేదా ఆఫీస్ పనుల మీదో వేరే ఊర్లకు వెళ్లినప్పుడు చాలామంది హోటల్ గదుల్లో బస చేస్తుంటారు. అక్కడ లభించే విలాసవంతమైన సదుపాయాలను చూసి మురిసిపోతుంటారు. అయితే, హోటల్ రూమ్‌లోకి అడుగు పెట్టగానే కనిపించే ఆ ఒక్క వస్తువును ఉపయోగించే ముందు ఇకపై రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే, అక్కడ ఉండే ఒక నిర్దిష్టమైన వస్తువు వల్ల మీ ఆరోగ్యం తీవ్రంగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంతర్జాతీయ హోటల్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
ఆ కప్పు కాఫీ వెనుక ఉన్న అసలు కథేంటి?: సాధారణంగా హోటల్ గదుల్లో బెడ్, టీవీ, సోఫాలతో పాటు వేడి నీళ్లు లేదా కాఫీ, టీలు తయారు చేసుకోవడానికి 'ఎలక్ట్రిక్ కెటిల్' (Electric Kettle) అందుబాటులో ఉంచుతారు. ముఖ్యంగా చలి ప్రదేశాల్లోని హోటళ్లలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ప్రయాణ అలసటను దూరం చేసుకోవడానికి రూమ్‌లోకి రాగానే చాలామంది ఆ కెటిల్ సహాయంతో టీనో, కాఫీనో కాచుకుని తాగుతుంటారు. కానీ, ప్రముఖ హోటల్ మేనేజ్‌మెంట్ నిపుణుడు విలియం హాన్సన్ చెప్పిన నిజాలు వింటే మాత్రం మీరు ఆ వస్తువును తాకడానికి కూడా భయపడతారు.

3 / 5
కెటిల్‌లో అంతర్గత దుస్తులు ఉతుకుతున్నారు..!: ఒక సర్వే ప్రకారం.. హోటల్ గదుల్లో ఉండే ఎలక్ట్రిక్ కెటిళ్లను కేవలం నీళ్లు మరిగించడానికి మాత్రమే కాకుండా, కొందరు వింతైన పనుల కోసం వాడుతున్నారట. దాదాపు 23 శాతం మంది ప్రయాణికులు తమ అంతర్గత దుస్తులను (Undergarments) ఉతకడానికి, వాటిని క్రిమిరహితం చేయడానికి ఈ హోటల్ కెటిళ్లలోని వేడి నీటిని వాడుతున్నట్లు సంచలన సర్వేలో తేలింది. మరికొందరు పర్యాటకులు నూడుల్స్ వంటి పదార్థాలను నేరుగా ఆ కెటిల్‌లోనే వండేస్తున్నారు. దీనివల్ల ఆ పాత్రలు తీవ్రంగా కలుషితమై బ్యాక్టీరియాకు నిలయాలుగా మారుతున్నాయి.

4 / 5
తప్పకపోతే వాడాలంటే ఏం చేయాలి? ఒకవేళ మీకు ఆ కెటిల్ ఉపయోగించడం అత్యవసరం అయితే, నిపుణులు ఒక ముఖ్యమైన చిట్కాను సూచిస్తున్నారు. మొదట ఆ కెటిల్‌లో నిండుగా మంచి నీటిని పోసి బాగా మరిగించాలి. ఆ మరిగిన నీటిని పూర్తిగా పారబోసి, ఆ పాత్రను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాతే మళ్లీ తాజా నీటిని పోసి మీకు నచ్చిన పానీయాలను తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే సున్నపు అవశేషాలు, బ్యాక్టీరియా కొంతవరకు నశిస్తాయి.

5 / 5
హోటల్ సిబ్బందితో మర్యాద ముఖ్యం..: చాలా హోటళ్లు తమ గదులను, అందులోని వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాయి. అయితే, ప్రతి ఒక్క వస్తువును లోతుగా శుభ్రం చేయడం సిబ్బందికి సాధ్యం కాకపోవచ్చు. అందుకే ప్రయాణికులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని నిపుణులు కోరుతున్నారు. కొందరు హోటల్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం, గదులను అపరిశుభ్రంగా వదిలేయడం వంటివి చేస్తుంటారు. మంచి ప్రవర్తన వల్ల హోటల్ సిబ్బంది నుంచి మనకు మరింత మెరుగైన సేవలు లభించే అవకాశం ఉంటుంది.

Follow Us