
ఉలవలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా కిడ్నీ ఆరోగ్యానికి, జీర్ణక్రియ పనితీరున మెరుగుపరచడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ ఉలవలతో చేసే వడలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే దీనిలో ఫైబర్, ప్రోటీన్లు కూడా ఉన్నాయి. అంతే కాదు ఇవి కిడ్నీలో రాళ్లను కూడా కరిగిస్తాయని కొందరు చెబుతున్నారు మరి లేట్ చేయకుండా వీటిని ఎలా చేయాలో చూద్దాం..

ఉలవ వడలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఉలవలు , ఒక ఉల్లిపాయ , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు , అర కప్పు నూనెను తీసుకోవాలి. అయితే, దీనిని సరైన కొలతలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

ఉలవ వడల తయారీ విధానం : ముందుగా ఉలవలను తీసుకుని కనీస 6 గంటలు పాటు బాగా నానబెట్టాలి. వాటిలో ఉన్న నీరు వంపేసి దానిలో కొద్దిగా ఉలవలను వేసి వాటిని ముద్దలాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , నాలుగు కరివేపాకు ఆకులు , కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.

ఉలవ వడల తయారీ విధానం : ఆ తరవాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వడలుగా చేసుకోవాలి. ఇంకా వేడినూనెలో గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇంకా వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతోంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తినండి.

ఉలవ వడల వలన ఎన్నో లాభాలు : ఉలవల్లో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా ఇది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే, శరీరానికి కూడా మంచి ప్రోటీన్ అందిస్తుంది. ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.