Horoscope Today (March 18, 2023): ఆ రాశివారి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు..

| Edited By: Subhash Goud

Mar 18, 2023 | 2:00 AM

Daily Horoscope Today: తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. 12 రాశుల వారికి శనివారం (మార్చి 18) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక పరిస్థితి చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటిస్తారు. గ్రహచారం ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. కుటుంబ జీవితం సాఫీగానే సాగిపోతుంది. పిల్లల జీవితాలు బాగానే ఉంటాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొంతమేరకు చక్కబడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి, తోబుట్టువుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువులో విజయాలు సాధిస్తారు.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): అదనపు ఆదాయం కలిసి వస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ప్రాధాన్యం కూడా ఎక్కువ అవుతుంది. స్నేహితులతో విందులు,  విహారాల్లో పాల్గొంటారు. బంధువులతో అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. వీసా సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు రుణ సమస్యలను తగ్గించుకుంటారు. అదనపు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉంటుంది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గాన్ ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం కూడా చేస్తారు. కొందరు మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులను పూర్తి చేస్తారు. బంధువులలో ఒక ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.  ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఉద్యోగంలో కూడా ఒకటి రెండు సమస్యలు తలెత్తవచ్చు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది. బంధువుల నుంచి ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. తోబుట్టువులతో అపార్ధాలు తొలగిపోతాయి. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆస్తికి సంబంధించి ఒక కోర్టు కేసులో నెగ్గే అవకాశం ఉంది.  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వటం కానీ, తీసుకోవడం కానీ చేయవద్దు. ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇతర కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. సంతానం పురోగతి సాధిస్తారు. శుభవార్త వింటారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగ పరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది కానీ, కుటుంబ జీవితంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఇతరులతో వ్యవహరించడంలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. వృత్తి జీవితంలో ఉన్నవారు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సంతానంలో ఒకరికి బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు బాగా లాభపడే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాగ్దానాలు, హామీలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కనిపిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. మీ బరువు బాధ్యతలను సహచరులు పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధువుల సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరం.

11 / 12
కుంభం(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రోజు అంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా బాగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ జీవితంలో అపార్ధాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కొంచెం ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. పిల్లలనుంచి ఆశించిన శుభవార్త వినే అవకాశం ఉంది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు, నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలను సూచనలను తూచా తప్పక పాటిస్తారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. అయితే, అనవసర ఖర్చులను, విలాసాలను తగ్గించుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు. శుభవార్త వింటారు.