మైసూర్ బోండా.. ఇలా చేస్తే రుచి అద్భుతమే

Updated on: Oct 09, 2026 | 8:21 AM

మైసూర్ బోండాలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ, బయట తినే వాటికి అంటే, వీటిని మన ఇంటిలోనే ప్రిపేర్ చేసుకుంటే రుచి మరింత అద్భుతంగా, లోపల పిండి పూర్తిగా ఉడికిపోతుంది. అందువలన బయట కొనే పనే లేకుండా ఇంటిలోనే టేస్టీ టేస్టీ బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే :   పుల్లటి పెరుగు: 1 కప్పు,   మైదా పిండి: 1 కప్పు ,   ఉప్పు: రుచికి సరిపడా,   వంట సోడా: అర టీస్పూన్,  నూనె: 1 టేబుల్ స్పూన్ ,   జీలకర్ర: 1 టీస్పూన్,   కరివేపాకు: 1 టేబుల్ స్పూన్,   అల్లం: అర టేబుల్ స్పూన్,  పచ్చిమిర్చి: 1 టేబుల్ స్పూన్ ,  వేడినీళ్లు.

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే..  ముందుగా, ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు పుల్లటి పెరుగును వేయండి. ఈ పెరుగును ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెరుగు మంచిగా సాఫ్ట్ గా, క్రీమీ టెక్స్చర్ తో తయారవుతుంది. ఇది బోండాలకు మంచి స్పాంజీనెస్ అందిస్తుంది.  బీట్ చేసుకున్న పెరుగులో రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ వంట సోడా, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మరో రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేయండి. పెరుగు, వంట సోడా కలిసినప్పుడు బబుల్స్ ఏర్పడతాయి. ఈ రియాక్షన్ బోండాలు గుల్లగా, ఫ్లఫీగా రావడానికి సహాయపడుతుంది.

3 / 5
తర్వాత  ఇప్పుడు మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఈ మిశ్రమంలో వేయాలి. తరువాత, కొద్దికొద్దిగా వేడినీళ్లను పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మైసూర్ బోండా పిండి మరీ లూస్ గా ఉండకూడదు కాబట్టి, నీళ్లను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పోసుకుంటూ జాగ్రత్తగా కలపండి. వేడినీళ్లు ఉపయోగించడం వల్ల పిండి త్వరగా పులిసి, బోండాలు గుండ్రంగా వస్తాయి.

4 / 5
 పిండి మొత్తం కలిసిన తరువాత, పిండిని కనీసం ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి.  దీని వలన బోండాలు మంచిగా వస్తాయి. తర్వాత  బీట్ చేసుకున్న పిండిలోకి ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు, అర టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం , ఒక టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.  తర్వాత పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

5 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో నూనె పోసి, నూనెను బాగా వేడి చేయాలి. తర్వాత చేతిలోకి పిండి తీసుకొని గుడ్రంగా బోండాలు చేసుకుంటూ పిండిలో వేయాలి.  నూనెలో బోండాలను వేసిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి, మంచిగా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ బోండాలు రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us