పిల్లలకు బలాన్ని ఇచ్చే ఉసిరి క్యాండీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?

Updated on: Oct 15, 2026 | 4:21 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా బయట దొరికే చాక్లెట్స్ వంటి వాటి కంటే, ఇంటిలో ఆరోగ్యకరమైనవి తయారు చేసి ఇవ్వాలి అనుకుంటారు. అలాంటి వారికి బెస్ట్ ఇదే. ఉసిరితో ఇలా క్యాండీస్ తింటే వారు చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాగా, ప్రిపేర్ చేసే విధానం చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే ..   రాశి ఉసిరికాయలు - 1/2 కిలో,  చక్కెర - 1/2 కిలో ,   అల్లం - 4-5 అంగుళాల ముక్క,   ఉప్పు - 1/2 టీస్పూన్,  నల్ల ఉప్పు - 1/2 టీస్పూన్ ,   మిరియాల పొడి - 1/2,  సోంపు పొడి - 1/2 టీస్పూన్ ,  కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్‌స్పూన్,  నిమ్మరసం - 1/2 చెక్క,  నెయ్యి - 1 టీస్పూన్ ,  షుగర్ పౌడర్ లేదా గ్లూకోజ్ పౌడర్ - కోటింగ్ కోసం

2 / 5
ముందుగా, అరకేజీ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి.   తర్వాత ఒక స్టీమర్ తీసుకొని అందులో సరిపడ నీళ్లు పోసి, ఉసిరికాయలు వేసి మూత పెట్టాలి. దాదాపు 20 నిమిషాల వరకు ఆవిరిపై వాటిని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపి, ఉసిరికాయలను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిలోని గింజలను తీసివేసి, ఉసిరి ముక్కలను విడదీయాలి.

3 / 5
 ఈ ఉసిరి ముక్కలను మిక్సీ జార్‌లోకి తీసుకుని, దాంతో పాటు చిన్న అల్లం ముక్క వేసి నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం కూడా ఆరోగ్యానికి, ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇప్పుడు, స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, 1 టీస్పూన్ నెయ్యి వేసి, గ్రైండ్ చేసుకున్న ఉసిరి అల్లం పేస్ట్‌ను అందులో వేయాలి.

4 / 5
అదే పాన్‌లో, మనం తీసుకున్న ఉసిరికాయల పరిమాణానికి సమానంగా 1/2 కిలో చక్కెరను వేయాలి. చక్కెర బదులుగా బెల్లం లేదా పటికబెల్లం కూడా ఉపయోగించవచ్చు. చక్కెరను పిల్లలు ఇష్టంగా తినడానికి, మంచి రంగు, ఆకృతి కోసం ఉపయోగిస్తున్నారు. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, చక్కెర కరిగి, మిశ్రమం చిక్కబడే వరకు గరిటతో కలుపుతూ 115 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రం చిక్కబడే సమయంలో ఉప్పు, మిరియాల పొడి, సోంపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. దాదాపు 40 నిమిషాల వరకు ఇది ఉడుకుతుంది. తర్వాత చాలా చిక్కబడుతుంది.

5 / 5
 ఆ తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దానిని వేసి మరో పదినిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా ఉడికి దగ్గరగా వచ్చిన తర్వాత దానిని చల్లారబెట్టి, నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్‌కు నెయ్యి రాసి, తర్వాత దానిపై మిశ్రమం వేసి రూల్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండటానికి, కొద్దిగా గ్లూకోజ్ పౌడర్‌లో వేసి బాగా కోట్ చేయాలి. వీటిని గాలి చొరబడని బాక్స్‌లో వేసి స్టోర్ చేసుకోవాలి అంతే.

Loading...
Unable to load recommendations.
Follow Us