PM Modi: 1984 జన్మాష్టమి రోజున ఆసక్తికర సంఘటన.. మోదీ ఏం చేశారో తెలిస్తే..

దేశ ప్రజ‌ల‌కు ప్రధాని న‌రేంద్ర మోదీ సోష‌ల్ మీడియా వేదిక‌గా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. 'దేశ ప్రజ‌లంద‌రికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణా' అని ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.

|

Updated on: Aug 26, 2024 | 11:42 AM

దేశ ప్రజ‌ల‌కు ప్రధాని న‌రేంద్ర మోదీ సోష‌ల్ మీడియా వేదిక‌గా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. 'దేశ ప్రజ‌లంద‌రికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణా' అని ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి తన యుక్త వయస్సులో సరిగ్గా 40 ఏళ్ల క్రితం శ్రీకృష్ణాష్టమి రోజున రెండు ఊర్లను ఏకంగా చేసి.. అల్లర్లను ఎలా ఆపారో ఇప్పుడు తెలుసుకుందామా.

1 / 5
1980ల ప్రారంభంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారకర్తగా చేస్తున్న జన్మాష్టమి నాటిది ఈ సంఘటన. 1984లో గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలోని చిన్న పట్టణం ప్రంతిజ్ మత హింసలతో కొట్టుమిట్టాడుతోంది. ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలతో అక్కడ నివాసముంటున్న హిందువులలో తీవ్ర భయందోళనలు చెలరేగాయి. అనేక హిందూ కుటుంబాలు అక్కడ నుంచి వలస వెళ్లిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పరిష్కారం కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ చెంతకు చేరారు. వారి బాధలు విన్న మోదీ.. ఒక చక్కటి ప్రణాళికతో ముందుకొచ్చారు. ప్రంతిజ్ నుంచి వలస వెళ్లిన కుటుంబాలను తిరిగి రావాలని కోరారు.

2 / 5
ప్రంతిజ్‌ను సందర్శించిన మోదీ.. సమావేశం కోసం బడి భాగోల్, నాని భాగోల్ ప్రాంతాలకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, హిందూ సంఘాల నాయకులు, సామాజిక సమూహాలకు చెందిన పెద్దలు, ఆధ్యాత్మిక సంస్థలు నడిపేవారిని, ప్రముఖులను పిలిచారు. వారందరితో విస్తృతంగా చర్చించి.. ఏకతాటిపైకి తీసుకురావాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. శాశ్వత పరిష్కారానికి హింస మార్గం కాదని వారికి అర్థమయ్యేలా చేసారు. అసలు పరిష్కారం ఐక్యతలోనే ఉంది. సామాజిక కార్యక్రమం ద్వారా హిందూ సమాజం ఒక్కతాటిపైకి రావాలని మోదీ ప్రతిపాదించారు. జన్మాష్టమి సమీపిస్తున్న తరుణంలో ఐక్యతను చాటుకునేందుకు దీన్ని అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

3 / 5
నరేంద్ర మోదీ ప్రతిపాదన ఆ రెండు ప్రాంతాలవారిలో ఉత్సాహాన్ని పెంపొందించింది. ప్రంతిజ్ నివాసితులు, వివిధ వర్గాలవారు శోభా యాత్రను నిర్వహించి జన్మాష్టమిను వైభవంగా జరిపారు. ఆ సమయంలో జన్మాష్టమి ఏర్పాట్లన్నీ కూడా మోదీ దగ్గరుండి చూసుకున్నారు. కుల, వర్గాలకు అతీతంగా హిందూ సమాజంలోని ప్రతీ ఒక్కరూ కృష్ణుడి శోభాయాత్రలో పాల్గొన్నారు. మోదీ రాకతో అల్లకల్లోలంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా శోభాయమానంగా మారింది.

4 / 5
హింసాకాండలకు ఐక్యత ఒకటే విరుగుడని ఆ ప్రాంతం యావత్ సమాజానికి తెలిపింది. ఇక అప్పటి నుంచి ఎలాంటి హింసాత్మక ఘటనలు ఆ ప్రాంతంలో చోటు చేసుకోలేదు. ప్రధాని మోదీ ఆ సమయంలో చేసిన ఎన్నో ప్రయత్నాలు.. ఉద్రిక్తతలను అణచివేయడమే కాకుండా ఆ ప్రాంతంలో RSS నెట్‌వర్క్‌ను విస్తరించడానికి సహాయపడ్డాయి.

5 / 5
Follow us
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.

ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..

ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?

తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?

కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి

కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!

బ్రెయిన్‌ సర్జరీలో వైద్యుల తప్పిదం.. పాపం ఆ రోగి.!

ఇంకొక్క రోజు సెలవు పెట్టినా.. ఆ యువతి బతికేది.!

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..ఆయిల్‌ ఫ్యాక్టరీలో మంటలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోండి.!