‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’  పెద్దోడుగా తొలి ఎంపిక ఆయనే.. 

TV9 Telugu

26 August 2024

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్‌, మహేశ్‌బాబు హీరోలుగా నటించిన మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.

2013లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో అంజలి, సమంత హీరోయిన్లుగా ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, తనికెళ్ళ భరణి, రావు రమేష్, రవి బాబు కీలక పాత్రల్లో నటించారు. మురళి మోహన్ అతిధి పాత్రలో కనిపించరు.

ఈ చిత్రంలో సీత పాత్రలో అంజలి జీవించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి గుర్తు చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రంలో వెంకటేశ్‌, మహేశ్‌బాబు పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో మెప్పించారు.

గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు శ్రీకాంత్ అడ్డాల.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడు పాత్ర కోసం ముందుగా పవన్‌కల్యాణ్‌ని అనుకున్నామని చెప్పారు.

పవర్ స్టార్ అప్పుడు మరో సినిమాతో బిజీగా ఉండి అది కుదరకపోయడంతో హీరో వెంకటేష్‎ని పెట్టినట్టు తెలిపారు.