ఏనుగు వెంట్రుకల నగలతో నరదిష్టి దూరం..
TV9 Telugu
26 August 2024
ఏనుగు వెంట్రుకలను వాడి చేసిన బంగారు నగలు ఇప్పుడు నగల్లో నయా ట్రెండ్. అవును ఇప్పుడు చాలామంది ఇలా చేస్తున్నారు.
మనిషి జుట్టుకన్నా ఎన్నో రెట్లు మందంగా ఉండే ఈ వెంట్రుకలను నీళ్లలో ఉడికించి శుభ్రపరిస్తే నగల డిజైన్లకు తగ్గట్టు ఎలా కావాలంటే అలా వంగుతాయి.
నగల షాపుల్లో చూసే ఎలిఫెంట్ హెయిర్ జ్యువెలరీలో ఉండేది ఏనుగు వెంట్రుకలే అన్నమాట. ఈ విషయం చాలామందికి తెలీదు.
ఒక్క ఉంగరాలే కాదు, గొలుసులు, బ్రేస్‌లెట్లు, జూకాలు, గాజులు… ఇలా అన్ని నగల్లోనూ ఇప్పుడు ఎలిఫెంట్ హెయిర్ ఫ్యాషన్‌గా మారింది.
ఏనుగు వెంట్రుక చెడును పారదోలి శాంతిని, ప్రేమను, సంపదను, ఆరోగ్యాన్ని ఇస్తుందని ఓ నమ్మకం. అందుకే వీటితో చేసిన నగలు ధరిస్తారు.
నగలు ధరిస్తే చెడు దృష్టి సోకదని చెబుతారు. జపాన్, ఆఫ్రికా కథల్లో వీటి ప్రస్తావన ఎక్కువగా ఉండటం చూస్తాం.
అయితే నమ్మినా నమ్మక పోయినా వెరైటీ కోసం ఇష్టపడి కాస్త ఖరీదైనా పర్వాలేదనుకుని ధరించే వాళ్లూ కూడా ఉంటారు.
ఏనుగు వెంట్రుకల నగలు మరింత కాలం మన్నాలంటే మాత్రం ఏడాదికి రెండుమూడు సార్లు కాస్త ఆలివ్ నూనెతో తుడ వాల్సిందే.
ఇక్కడ క్లిక్ చెయ్యండి