యముడు ఈ చేపను మరచిపోయాడా..!, 392 ఏళ్ళు జీవించిన చేప
TV9 Telugu
26 August 2024
ప్రకృతి సృష్టించిన ప్రపంచంలోని చాల రహస్యాలను ఇప్పటికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించిన ఛేదించలేకపోయారు.
దీంతో ప్రతిరోజూ కొన్ని విషయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంటాయి.అలాంటిదే ఈరోజు చూద్దాం.
తాజాగా ఓ చేప జీవితకాలంపై సోషల్ మీడియా, ఇంటర్నెట్ వేదికగా తెగ చర్చ జరుగుతోంది. దాదాపు 392 సంవత్సరాలు జీవించింది ఓ చేప.
నెమ్మదిగా స్విమ్మింగ్ చేయడం వల్ల వాటి శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేస్తుందని, అందుకే ఎక్కువ కాలం జీవించగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
పరిశోధకులు కనుగొన్న ఈ ప్రత్యేక సొరచేప భూమిపై నివసించే అత్యంత పురాతనమైన సకశేరుక సొరచేప, దీని వయస్సు లెన్స్ రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా నిర్ణయించారు.
ఈ చేప నెమ్మదిగా జీవక్రియ, లోతైన చల్లని నీటిలో నివసించడం వల్ల ఎక్కువ కాలం జీవించగలిగింది. శాస్త్రవేత్తలు శోధిస్తున్న రహస్యాలలో ఇది ఒకటి.
శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సొరచేప వయస్సు సుమారు 392 సంవత్సరాలు. ఈ చేప సుమారు 400 సంవత్సరాలు హాయిగా జీవించగలదంటున్నారు శాస్త్రవేత్తలు.
ఈ వీడియోను @AMAZlNGNATURE అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. ఇది చుసిన జనాలు ఇంటర్నెట్లో తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి