Gaming Phones under 25K: ఈ ఫోన్లు నిజంగా ‘గేమ్’ చేంజర్లే.. తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో అదరగొడుతున్నాయ్..

|

Mar 27, 2023 | 4:30 PM

మీరు వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడతారా? అది కూడా ఫోన్ లోనే ఎక్కువగా ఆడటానికి ఇష్టపడతారా? అందుకోసం మంచి స్మార్ట్ ఫోన్.. అనువైన బడ్జెట్ లో కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడితే ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తాయి. అలాగే ఆ ఫోన్ కి మంచి గ్రాఫిక్స్ కూడా అవసరం. అటువంటి అధిక సామర్థ్యంతో కూడిన స్మార్ట్ ఫోన్ లను మీకు పరిచయం చేస్తున్నాం. అది కూడా కేవలం రూ. 25,000ల లోపు బడ్జెట్లోనే. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి..

1 / 5
Redmi K50i: తక్కువ ధరలో మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఆశించే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధర అమెజాన్ లో రూ. 23,999 గా ఉంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది ఎగువ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో వస్తుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5080mAh బ్యాటరీని కలిగి ఉంది.

2 / 5
Realme GT Neo 3T: అమెజాన్లో దీని ధర రూ. 24999గా ఉంది. స్నాప్ డ్రాగన్ 870 5జీ ఓఎస్ తో పనిచేస్తుంది. దీనిలో 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడిన 5000mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 64MP లెఫ్ట్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది.

3 / 5
Xiaomi 11i:  ఈ ఫోన్  6జీబీ ర్యామ్ 128జీడీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తోంది. దీని ధర ఫ్లిప్ కార్ట్ లో రూ. 24999గా ఉంది. ఇది 6.67-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.  ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ చిప్‌తో పనిచేస్తుంది.

4 / 5
Realme 10 Pro Plus: ఇది ప్రీమియం కర్వ్డ్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే తో వస్తుంది. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ ఉంటుంది. 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ,  2 ఎంపీ కెమెరాలతో వస్తుంది. 6జీడీ ర్యామ్, 128జీడీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24999గా ఉంది.

5 / 5
iQOO Neo 6: గేమింగ్ కోసం ఈ ఫోన్ మీకు అత్యుత్తమ ఎంపిక. ఇది స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కూడా అమెజాన్ లో రూ. 25,000 లకంటే తక్కువకే లభిస్తుంది.