
ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యుడి భగ భగలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. అంతే కాకుండా చాలా మంది వడ దెబ్బ బారిన పడుతున్నారు. దీంతో కొందరిలో తెలియని భయం మొదలైంది. ముఖ్యంగా ఎండ దెబ్బ తగిలినా కూడా వడదెబ్బ అనుకొని కంగారు పడిపోయి సమస్యను మరింత తీవ్రతరం చేసుకొని ఆసుపత్రి పాలు అవుతున్నారు. అందువలన అసలు ఎండ దెబ్బ, వడ దెబ్బ అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

ఎండాకాలం వస్తే చాలు అధిక వేడితో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందుకే సమ్మర్‌లో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ మధ్య కాలంలో కొంత మంది వడదెబ్బ బారిన పడగా, చాలా మంది ఎండ దెబ్బ బారిన పడుతున్నారు. ముఖ్యంగా వడ దెబ్బ తగిలినా, ఎండ దెబ్బ అనుకొని నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాగా, అసలు ఎండ దెబ్బ, వడ దెబ్బ అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు మనం చూద్దాం.

వడ దెబ్బ అంటే, ప్రాణాంతకమైనదని చెప్పాలి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు దాటుతుంది. ఈ సమయంలో మెదడు పనితీరు దెబ్బతినడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ దెబ్బ తింటుంది. వడదెబ్బ తగిలినప్పుడు చెమట రావడం ఆగిపోతుంది. అంతే కాకుండా చర్మం పొడి బారడం, నాడి, గుండె వేగంగా కొట్టుకోవడం, సృహ కోల్పోవడం, కొన్ని సార్లు ఫిట్స్ కూడా రావడం జరుగుతుంది.

మరి కొన్ని సార్లు, చర్మం వేడిగా, మైకం కమ్మడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు రావడం, కళ్లు తిరగడం, బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇది వడ దెబ్బ అని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుంది. అలాగే వడ దెబ్బ తగిలిన వ్యక్తిని తడి క్లాత్‌లో చర్మాన్ని తుడవడం, గాలి తగిలేలా చేయడం వంటిది చేయాలి.

ఎండ దెబ్బ అంటే? ఎండ దెబ్బ అంటే శరీరం వేడిని తట్టుకోలేక అలసట చెందడం. ఇది ఎండ వేడి, ఉష్ణోగ్రత వలన శరీరం చాలా వరకు నీటిని కోల్పోవడం వలన వస్తుంది. ఎండ దెబ్బ తగిలితే, విపరీతంగా చెమటలు పట్టడం, అలసట, కండరాల తిమ్మరి, తలనొప్పి, వికారం, కళ్లు తిరగడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మీకు ఒక వ్యక్తి వడ దెబ్బ తగిలింది అనిపిస్తే వెంటనే మజ్జిగ తాగించడం, ఓఆర్ఎస్ నీటిని అందించడం, ఫ్యాన్ కింద, గాలి తగిలే చోట ఉంచడం వంటిది చేయాలి.