Heart Blockage: శరీరం ముందే చెబుతుంది.. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.. లేకపోతే పెను ప్రమాదమే..

|

May 06, 2024 | 6:01 PM

ప్రస్తుత కాలంలో మనుషులను గుండె సమస్యలు వెంటాడుతున్నాయి.. దీనికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి.. అందుకే.. ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవడం ముఖ్యం..

1 / 7
ప్రస్తుత కాలంలో మనుషులను గుండె సమస్యలు వెంటాడుతున్నాయి.. దీనికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి.. అందుకే.. ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవడం ముఖ్యం.. గుండె సమస్యల్లో హార్ట్ బ్లాక్ (Heart Blockage) ఒకటి.. గుండె పైగది నుండి విద్యుత్ సంకేతాలు గుండె దిగువ గదికి సరిగ్గా చేరుకోనప్పుడు హార్ట్ బ్లాక్ ఏర్పడుతుంది. హార్ట్ బ్లాక్ ను.. అట్రియోవెంట్రిక్యులర్ (AV) బ్లాక్ లేదా కండక్షన్ డిజార్డర్ అని కూడా పిలుస్తారు. ఇది గుండె కండరాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే కొరోనరీ ధమనులలో రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడాన్ని సూచిస్తుంది.

2 / 7
మొదటి దశలో ఇది తక్కువ సమస్యలను కలిగిస్తుంది.. కానీ మూడవ దశలో హార్ట్ బ్లాక్ ప్రాణాంతకం కావచ్చు. వయసు పెరిగే కొద్దీ గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండెలో అడ్డంకులు ఏర్పడినప్పుడు, మనకు అనేక రకాల సంకేతాలు కనిపిస్తాయి. కానీ చాలా మంది దానిని నిర్లక్ష్యం చేస్తారు. ఈ నిర్లక్ష్యం క్రమంగా గుండెపోటుకు దారి తీస్తుంది.

3 / 7
శ్వాస సమస్య: కొంతమందికి తరచుగా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు కారణం ఏమిటో మీరే ఆలోచించి.. వైద్యులను సంప్రదిస్తే.. ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడొచ్చు..

4 / 7
మూర్ఛ: తరచుగా మూర్ఛపోవడం హార్ట్ బ్లాక్‌కి సంకేతం కావచ్చు. గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఈ సంకేతం కనిపిస్తుంది. ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి..

5 / 7
ఛాతీ నొప్పి: గుండెలో అడ్డంకులు ఏర్పడితే, చాలా మంది ఈ లక్షణాన్ని గ్యాస్ సమస్యగా విస్మరిస్తారు. కాబట్టి మీకు ఛాతీ, గుండె చుట్టుపక్కల నొప్పి అనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు.

6 / 7
తలతిరగడం: తలతిరగడం హార్ట్ బ్లాక్‌కి సంకేతం. ఎటువంటి కారణం లేకుండా తరచుగా తలతిరగడం అనేది ప్రమాదకరం.. దీనిని సాధారణ పరిస్థితిగా పరిగణించకూడదు.. ఇటువంటి సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి..

7 / 7
వికారం: వికారం, వాంతులు కూడా గుండె (హార్ట్ బ్లాక్) అడ్డంకిని సూచిస్తాయి. ప్రజలు సాధారణంగా ఇటువంటి సంకేతాలను విస్మరిస్తారు. మీ శరీరంలో అలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే నిపుణుల సలహా తీసుకోండి.