
వెజిటేబుల్ రైస్ రిసిపీ తయారు చేయాడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. బియ్యం: 1 గ్లాసు, ఆయిల్: 2 టీస్పూన్లు , 3 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 1 టేబుల్‌స్పూన్, పచ్చిమిరపకాయలు: 6, వెల్లుల్లి రెమ్మలు: 6, అల్లం: 1 అంగుళం ముక్క, పుదీనా ఆకులు: ఒక గుప్పెడు, కొత్తిమీర: ఒక గుప్పెడు, మెంతికూర: కొద్దిగా, దాల్చినచెక్క: 1 అంగుళం ముక్క, బిర్యానీ ఆకు: 1, లవంగాలు: 3, యాలకులు: 2, రాతి పువ్వు: కొద్దిగా, ఉల్లిపాయ: 1 మీడియం సైజు, టమాటాలు: 2 మీడియం సైజు, పసుపు: 1/2 టీస్పూన్, ధనియాల పొడి: 1 టీస్పూన్, జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్, గరం మసాలా పొడి: 1/2 టీస్పూన్, బంగాళదుంపలు: 2, పచ్చి బఠానీలు: 1/4 కప్పు, ఉప్పు: రుచికి సరిపడా.

తయారీలోకి వెళ్లితే.. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని (తీసుకుని, రెండు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి, ఆయిల్ వేడయ్యాక, ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయలను ,వెల్లుల్లి రెమ్మలు, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా మెంతి ఆకులు వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని, ఆయిల్ వేసి, అది వేడయ్యాక, దాల్చినచెక్క, ఒక బిర్యానీ ఆకు, మూడు లవంగాలు, రెండు యాలకులు, కొద్దిగా రాతి పువ్వు వేసి లైట్‌గా వేయించండి. మసాలా దినుసులు వేగిన తర్వాత, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, రెండు మీడియం సైజు టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ టమాటా పేస్ట్ కూడా వేయండి. ఈ రెండు పేస్ట్లను ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించాలి. ఇలా వేగడం వల్ల పచ్చి వాసన పోయి రుచి పెరుగుతుంది.

తర్వాత, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకోవాలిడి. తరువాత, రెండు బంగాళదుంపల్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసినవి, పచ్చి బఠానీలు, మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి, మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.

మొత్తం కలుపుకున్న తర్వాత, నానబెట్టిన బియ్యాన్ని వేసి నిదానంగా ఒకసారి కలుపుకోండి. ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోయండి. మొత్తం కలిపిన తర్వాత, కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో రెండు విజిల్స్ రానివ్వండి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీయండి. గుమగుమలాడే వెజిటబుల్ రైస్ రెడీ.