Usirikaya Rasam: చలికాలంలో వచ్చే రోగాలన్నింటినీ తరిమికొట్టే కమ్మనైన ఉసిరికాయ రసం

Updated on: Nov 15, 2026 | 1:59 PM

చలికాలం మొదలైందంటే వాతావరణంలోని మార్పుల వల్ల చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరినీ జలుబు, గొంతులో కఫం, అజీర్తి వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ కాలంలో విరివిగా దొరికే ఉసిరికాయలతో రుచికరమైన వంటకాలు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా చింతపండు వాడకుండా, ఉసిరికాయలు, మిరియాల ఘాటుతో తయారుచేసే ఈ ఉసిరికాయ రసం గొంతుకు ఎంతో ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

1 / 5
కావలసిన పదార్థాలు: పెద్ద ఉసిరికాయలు 4, మిరియాలు 1 టీస్పూన్, జీలకర్ర ఒకటిన్నర టీస్పూన్లు (పేస్ట్ కోసం 1 టీస్పూన్, తాలింపు కోసం అర టీస్పూన్), పండిన పెద్ద టమాటా 1 లేదా చిన్నవి 2, నీళ్లు 1 లీటరు పావు, నూనె 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీస్పూన్, ఇంగువ 2 చిటికెలు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 1, అల్లం తరుగు 1 టీస్పూన్, పచ్చిమిర్చి 1, ఉప్పు రుచికి సరిపడా, పసుపు అర టీస్పూన్, మెత్తగా ఉడికించిన కందిపప్పు పావు కప్పు, కొత్తిమీర తరుగు కొద్దిగా.

2 / 5
ముందుగా నాలుగు నిమ్మకాయ సైజు ఉసిరికాయలను గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో ఈ ఉసిరికాయ ముక్కలు, ఒక టీస్పూన్ మిరియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, బాగా పండిన ఒక పెద్ద టమాటా ముక్కలు వేయాలి. ఇందులో పావు కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రసానికి పులుపు అంతా ఉసిరికాయ, పండిన టమాటాల నుండే వస్తుంది కాబట్టి చింతపండు అవసరం ఉండదు.

3 / 5
ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఒక టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, రెండు చిటికెలు ఇంగువ వేసి ఆవాలను చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు, తుంచిన ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే ఒక టీస్పూన్ సన్నని అల్లం తరుగు, నిలువుగా చీల్చిన ఒక పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి.

4 / 5
తాలింపు చక్కగా వేగిన తర్వాత ముందుగా రుబ్బుకున్న ఉసిరికాయ-టమాటా పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు, ఒకటింపావు లీటర్ల నీళ్లు పోసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. రసం మధ్యలో నురగతో పొంగు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి.

5 / 5
రసం చక్కగా మరిగిన తర్వాత, పావు కప్పు మెత్తగా ఉడికించి ఎనుపుకున్న కందిపప్పును ఇందులో వేసి కలపాలి. పప్పు వేయడం వల్ల రసానికి చిక్కదనం, పరిపూర్ణమైన రుచి వస్తాయి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. మిరియాల ఘాటుతో ఘుమఘుమలాడే ఈ ఉసిరికాయ రసాన్ని సూప్‌లా నేరుగా తాగినా లేదా వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. చలికాలంలో తరచూ ఈ రసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

Loading...
Unable to load recommendations.
Follow Us