
బెల్లం సిరప్‌లో డ్రై ఫ్రూట్స్ బాగా కలిసిన తర్వాత, గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అటుకుల పొడిని వేసి, ఉండలు లేకుండా ఫాస్ట్‌గా కలపాలి. మంచి ఫ్లేవర్ కోసం అర టీస్పూన్ యాలకుల పొడిని కూడా చేర్చి, లో టు మీడియం ఫ్లేమ్‌లో మిశ్రమం దగ్గరపడే వరకు కంటిన్యూస్‌గా కలుపుతూ ఉడికించాలి. దగ్గరగా వచ్చిన తర్వాత దీనిని కాస్త వేడిగా ఉన్న సమయంలోనే లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే వేడి వేడి అటుకులు పల్లీల లడ్డూలు రెడీ.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని, అందులో ఒక కప్పు అటుకుల్ని వేయాలి. గ్యాస్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, అటుకులు క్రిస్పీగా మారేంతవరకు వేయించాలి. అవి వేగాక వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక కప్పు పల్లీలను వేసి, గ్యాస్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి నెమ్మదిగా వేయించాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటి పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు చల్లారిన అటుకుల్ని మిక్సర్ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రవ్వను ఒక ప్లేట్‌లోకి మార్చుకుని, అదే జార్‌లో పొట్టు తీసిన పల్లీలను వేసి, మరీ మెత్తగా కాకుండా, బరకగా గ్రైండ్ చేయాలి. ఈ పల్లీల పొడిని కూడా అటుకుల రవ్వ ఉన్న ప్లేట్‌లోకి చేర్చి రెండింటినీ బాగా కలుపుకోవాలి. బరకగా ఉండటం వల్ల లడ్డు రుచిగా ఉంటుంది.

స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్‌లో కరిగించాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగి ఉడకడం మొదలుపెడితే సరిపోతుంది. ఈ సిరప్‌ను పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని వేసి గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అర కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి, లో ఫ్లేమ్‌లో మంచి రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్‌ను వడకట్టుకుంటూ పోయాలి. బెల్లంలో ఉన్న మలినాలు పోవడానికి వడకట్టడం ముఖ్యం.

Laddu 4