
కావాల్సిన పదార్థాలు : మటన్ కేజీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, టమాటా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె, పూదీన. కేవలం ఈ పదార్థాలతోనే చాలా సులభంగా మటన్ కర్రీని వండుకోవచ్చును.

తయారీలోకి వెళ్లితే.. ముందుగా కేజీ మటన్ తీసుకోవాలి. దానిని శుభ్రం చేసిన తర్వాత కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఆనియన్ పేస్ట్ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే కాకుండా కాస్త ధనియాల పొడి కూడా యాడ్ చేసి మొత్తం పూర్తిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి, నూనె పోయాలి. సరిపడినంత నూనె పోసి, అది వేడి అయిన తర్వాత అందులో తరిగిన పచ్చి మిర్చి, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పూదీనా వేసి మంచిగా కలుపుకోవాలి.

ఇప్పుడు అందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మటన్ మంచిగా కాస్త మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. కాస్త మటన్ ఉడుకుతుంది అనుకునే టప్పడు అందులో కారం, ఉప్పు వేసి మరో 15 నిమిషాల వరకు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి.

ఇలా చేయడం వలన దాదాపు మటన్ 75 శాతం వరకు ఉడుకుతుంది. మటన్ బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర, పూదీనా వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన మసాలాలు లేకపోయినప్పటికీ రుచి చాలా అద్భతంగా ఉంటుంది. అంతే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ, మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి.