హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది

Updated on: Jul 24, 2026 | 6:17 PM

భారతీయ సాంప్రదాయ వంటకాలలో పొడులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలుగువారి ఇళ్లలో రకరకాల కారం పొడులు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఉదయాన్నే టిఫిన్లలోకి చట్నీ చేసే ఓపిక లేకపోయినా, లేదా మధ్యాహ్నం వేడి వేడి అన్నంలోకి ఏం కూరలు తోచకపోయినా ఒక్క చెంచా కారం పొడి, కొద్దిగా నెయ్యి ఉంటే చాలు.. పొట్ట నిండా తృప్తిగా తినేయవచ్చు.

1 / 5
ఈ రోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన, అదే సమయంలో తింటుంటే మళ్లీ మళ్లీ తినాలనిపించే అల్ ఇన్ వన్ మునగాకు కరివేపాకు కారం పొడి తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఈ కారం పొడి ప్రత్యేకత ఏంటంటే.. ఇది కేవలం రుచినే కాకుండా శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. సాధారణంగా పిల్లలు మునగాకు, కరివేపాకులను కూరల్లో వస్తే తీసి పక్కన పెడుతుంటారు.

2 / 5
కానీ ఇలా పొడి రూపంలో చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మునగాకులో విటమిన్ సీ, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అలాగే కరివేపాకు కంటి చూపుకు, జుట్టు ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కారం పొడి తయారీ కోసం ముందుగా ఫ్రెష్‌గా తెంపిన మునగాకు, లేత కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి మినుములు, శనగపప్పు, పల్లీలు వేసి దోరగా వేయించాలి.

3 / 5
అందులోనే జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగుతున్నప్పుడు ఆరబెట్టిన కరివేపాకు, మునగాకు వేసి బాగా రోస్ట్ చేయాలి. పప్పులు ఎక్కువగా వేయడం వల్ల ఈ పొడికి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తాయి. చివరిగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె వేసి రంగు మారే వరకు వేయించి దించుకోవాలి.

4 / 5
ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత ఉప్పు చేర్చి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత తొక్క తీయని వెల్లుల్లి రేకలు వేసి మరొకసారి మిక్సీ పడితే గుమగుమలాడే కారం పొడి సిద్ధమవుతుంది. వెల్లుల్లిని చివర్లో వేయడం వల్ల పొడికి మంచి సువాసన వస్తుంది.

5 / 5
ఈ కారం పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, లేదా దోస పైన చల్లుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాల్చుకున్నా టేస్ట్ అదిరిపోతుంది. ఇడ్లీ, ఉప్మా, గారెలు ఇలా ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా ఇది సూపర్ కాంబినేషన్. గాజు సీసాలో నిల్వ చేసుకుంటే నెలల తరబడి తాజా సువాసనతో ఉంటుంది. మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ కారం పొడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.

Follow Us