Jowar Soup: బరువు తగ్గిస్తూ ఆరోగ్య ప్రయోజనాలను అందించే వేడివేడి జొన్న వెజ్ సూప్

Updated on: Aug 17, 2026 | 4:08 PM

వర్షాకాలంలో లేదా చలికాలంలో సాయంత్రం వేళల్లో ఒంట్లో బద్ధకం పోయి గొంతుకు కాస్త ఘాటుగా, హాయిగా తగిలేలా ఏదైనా వేడిగా తాగాలనిపిస్తుంది. చాలామంది మార్కెట్లో దొరికే కృత్రిమ రసాయనాలు, కార్న్‌ఫ్లోర్ ఎక్కువగా ఉండే రెడీమేడ్ సూప్ ప్యాకెట్లను వాడుతుంటారు. కానీ, మన వంటింట్లో ఉండే సంప్రదాయ జొన్నలు లేదా జొన్నపిండితో అత్యంత బలవర్ధకమైన వెజ్ సూప్‌ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

1 / 5
డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడేవారికి, బరువు తగ్గాలనుకునే డైట్ ప్రియులకు ఈ జొన్న సూప్ దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు:  రెండు టీస్పూన్ల జొన్న పిండి,  ఒక టీస్పూన్నూ నె లేదా నెయ్యి, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, రెండేసి టేబుల్ స్పూన్ల టమాటా ముక్కలు, కరివేపాకు, సుమారు అర లీటర్ నీళ్లు, ఉప్పు, తాజాగా దంచిన అర టీస్పూన్ మిరియాల పొడి, తాజా కొత్తిమీర, తగినంత నిమ్మరసం.

2 / 5
తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్‌లో ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆపై ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంతవరకు వేపాలి. అనంతరం సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, టమాటా ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు కలపాలి. టమాటాలు కాస్త మెత్తబడే వరకు వేయించాలి. మీకు నచ్చితే క్యాప్సికం, క్యాబేజీ లేదా బఠానీలను కూడా ఇందులో వేసుకోవచ్చు.

3 / 5
కూరగాయలు కొద్దిగా వేగాక సుమారు 400 నుండి 500 మిల్లీలీటర్ల నీళ్లు పోయాలి. దీనికి సరిపడా ఉప్పు, తాజాగా దంచిన అర టీస్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఎసరు బాగా మరగడం మొదలయ్యే వరకు ఉడికించాలి. మరోవైపు ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల జొన్నపిండిని తీసుకుని పావు కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా చిక్కని మిశ్రమంలా కలుపుకోవాలి.

4 / 5
ఇంట్లో జొన్నలు ఉంటే వాటిని మిక్సీలో మెత్తగా పట్టుకుని కూడా వాడుకోవచ్చు. పాన్‌లోని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కలిపి ఉంచుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని ఇందులో పోసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు నుండి మూడు నిమిషాల పాటు మరిగించాలి.

5 / 5
జొన్నపిండి ఉడికి సూప్ చక్కటి చిక్కదనానికి వస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి. దింపిన వెంటనే ఒకటి లేదా రెండు చెంచాల నిమ్మరసం పిండి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన వేడివేడి జొన్న సూప్ సిద్ధం! వర్షం పడుతున్నప్పుడు లేదా రాత్రి తేలికపాటి డిన్నర్ చేయాలనుకున్నప్పుడు ఈ సూప్ తాగితే శరీరానికి ఎంతో శక్తి, ఆరోగ్యం లభిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us