10 నిమిషాల్లో ఇన్స్టంట్ ఓట్స్ – బీట్‌రూట్ దోశ.. నానబెట్టే పనే లేదు! సూపర్ టేస్ట్‌, హెల్తీ కూడా..

Updated on: Mar 24, 2026 | 5:25 PM

ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం వెతుకుతున్నారా? అయితే ఈ ఓట్స్ - బీట్‌రూట్ దోశ మీకు సరైన ఎంపిక. సాధారణంగా దోశలు వేయాలంటే పప్పులు నానబెట్టాలి, పిండి పులియాలి. కానీ ఇన్ఫ్లుయెన్సర్ పూర్ణ మెహ్రా పంచుకున్న ఈ రెసిపీతో కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన దోశలను సిద్ధం చేసుకోవచ్చు. ఉదయం వేళ హడావిడిలో ఉన్నప్పుడు తక్కువ సమయంలో పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అదేలాగో ఇక్కడ చూద్దాం..

1 / 5
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే పోషకవిలువలున్న అల్పాహారం వండుకోవడం సవాలుగా మారింది. చాలామంది సమయం లేక జంక్ ఫుడ్ లేదా ఇన్స్టంట్ ప్యాకెట్ల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వారి కోసం డైటీషియన్, ఇన్ఫ్లుయెన్సర్ పూర్ణ మెహ్రా ఒక అద్భుతమైన రెసిపీని పరిచయం చేశారు. అదే ఓట్స్ - బీట్‌రూట్ దోశ. సాధారణ దోశ పిండి తయారీకి కనీసం 8-10 గంటల సమయం పడుతుంది. కానీ, ఈ ఓట్స్ దోశకు ఎలాంటి నానబెట్టడం లేదా ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) అవసరం లేదు. ఇది గ్లూటెన్ ఫ్రీ, డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

2 / 5
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మరియు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. బీట్‌రూట్ రక్తహీనతను తగ్గించి చర్మానికి మెరుపును ఇస్తుంది. ఈ రెండింటి కలయికతో చేసే ఇన్స్టంట్ దోశలు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి. ఉదయం వేళ హడావిడిలో ఉన్నప్పుడు తక్కువ సమయంలో పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. తయారీ విధానంలోకి వెళ్దాం..

3 / 5
కావలసిన పదార్థాలు: ఓట్స్ (రోల్డ్ లేదా ఇన్స్టంట్) - 1 కప్పు, బీట్‌రూట్ ముక్కలు - అర కప్పు, పెరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం ముక్క - చిన్నది, ఉప్పు - రుచికి సరిపడా, నీరు - పిండి కలపడానికి తగినంత మోతాదుగా తీసుకోవాలి.

4 / 5
ఇక తయారీ విధానం: పిండి తయారీకి ముందుగా ఓట్స్‌ను మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. అందులోనే బీట్‌రూట్ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పెరుగు మరియు కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మరికొన్ని నీళ్లు కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక, కొద్దిగా నూనె రాసి పిండిని దోశలా పలచగా పరవాలి. రెండు వైపులా ఎర్రగా కాలే వరకు ఉంచి తీసేయాలి.

5 / 5
ఆరోగ్య ప్రయోజనాలు: ఓట్స్‌లోని ఫైబర్ పొట్ట నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ వేడి వేడి దోశలను కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో తింటే అద్భుతంగా ఉంటాయి. రేపు పొద్దున్నే మీ కిచెన్‌లో దీన్ని ట్రై చేయండి!

Follow Us