
కొందరు ఉదయం లేవగానే రాత్రి మిగిలిన అన్నం బయట పారేస్తారు. మీరు ఇలా చేస్తే వేల డబ్బులు పోగొట్టుకున్నట్లే. ఎందుకంటే, ఇవి మన శరీరంలో వచ్చే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలవు.

మనలో కొందరు కడుపులో వేడి ఎక్కువయ్యి ఏ పనులు చెయ్యలేక నీరసించి పోతారు. అలాంటి వారు ఈ సద్దన్నం తింటే కడుపులో ఏసీ లా మొత్తాన్ని చల్లగా ఉంచుతుంది.

రాత్రిపూట మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే తిన్న తర్వాత వచ్చే పవర్ ఇంక వేరే ఏ ఫుడ్స్ వల్ల కూడా రాదు. కాబట్టి, బయట ఫుడ్స్ కంటే దీనిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి.

సద్దన్నం చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అంతేకాదు, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. కొన్ని దేశాల్లో అయిత దీనిని వేరే పేర్లు పెట్టి అమ్ముతున్నారు. కానీ, మనం మాత్రం తెల్లారాగానే సద్దన్నం తెచ్చి బయట పారేస్తున్నాము.

ఇంకా దీనిని ఎలా తినొచ్చు అంటే రాత్రి అన్నం మిగిలితే దానిలో పాలు, కొద్దిగా పెరుగు వేస్తే ఉదయానికి పెరుగుగా అవుతుంది. దీనిలో ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది.