
హనుమాన్ జయంతి చేయాల్సిన పనులు ఇవే.. ఉదయాన్నే స్నానం చేసి భక్తితో ఆ హనుమాన్ కు పూజ చేయాలి. అలాగే, మర్చిపోకుండా హనుమాన్ చాలీసాను చదవాలి. నేడు హనుమాన్ చాలిసా పారాయణం చేస్తే మీ పంట పండటం పక్కా అని పండితులు చెబుతున్నారు.

అలాగే, ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన బెల్లం, వడలు, అప్పాలు నైవేద్యంగా పెట్టాలి. అలాగే, పేదవారికి ఆహారం, బట్టలు దానం చేయాలి. ఇలా చేస్తే కష్టాలు మొత్తం తొలిగి సుఖాలు వెతుక్కుంటూ వస్తాయి.

హనుమాన్ జయంతి రోజున చేయకూడని పనులు ఇవే.. ఈ రోజు అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. ఏదైనా సరే.. సత్యంగా మాత్రమే మాట్లాడాలని చెబుతున్నారు. ఈ రోజు చాలా పవిత్రంగా ఉండాలి. ముఖ్యంగా నాన్ వెజ్, మద్యం వంటి వాటిని అస్సలు ముట్టకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు

ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ మీద కోపం చూపించకూడదు. శాంతంగా ఉండాలి. ఇల్లును అపవిత్రంగా ఉంచకూడదు. ఇంటిని మంచిగా శుభ్రం చేసుకుని పూజ చేయాలి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.