
మిక్సీ, రోలు లేకుండా కేవలం చేత్తోనే నలిపి ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది సంప్రదాయ రుచిని ఇస్తుంది. అయితే, ఇది వరకు రోజుల్లో అమ్మమ్మలు, నానమ్మలు ఇలాగే తినేవాళ్లు. ఇంకా ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తే రుచి మాత్రం అదుర్స్. ఇక అదే స్టైల్‌లో ఈ పచ్చడి చేస్తే ఇంట్లో చాలా మంది ఇష్టంగా తింటారు.

టమాటాలు కొద్దిగా పులుపు , కొద్దిగా పచ్చిమిర్చి కారం, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తె ఈ పచ్చడికి అద్భుత రుచి వస్తుంది. దీనిని చాలా మంది వేడి వేడి అన్నంలో తింటారు. ఇంకా దీనిలో నెయ్యి వేసుకుని కొద్దిగా పచ్చడితో తింటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు. ఇక పిల్లలు అయితే చాలా ఇష్టంగా లాగిస్తారు అంత టేస్టీగా ఉంటుంది.

ఈ పచ్చడి చేయడానికి ఎలాంటి మిక్సీలో గ్రైండ్ అవసరమే లేదు మీరు చేత్తో నలిపి చేయవచ్చు. ముందుగా టమాటాలు బాగా ఉడకబెట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే, ఇంకో దానిలో పచ్చి మిర్చి చింత పండును కూడా వేయించుకోవాలి. దీని వలనే రుచి మరింత పెరుగుతుంది. అలాగే, ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది.

ఇప్పటికి పల్లెటూర్లలో చాలా మంది ఇదే స్టైల్‌లో చేసి ఇలాంటి పచ్చడినే తినడానికి ఇష్ట పడుతున్నారు .ఈ పచ్చడి చెయ్యడానికి కొద్దీ సమయం చాలు. ఏం అవసరం లేదు ఇంట్లో టమాటాలు, పచ్చిమిర్చి 5 నిముషాల్లో చేసుకోవచ్చు. మీ ఇంటికి గెస్టులు వచ్చినా కూడా కూరలు లేకపోతేఈ పచ్చడి మంచి ఎంపిక అని చెప్పొచ్చు.

టమాటాల్లో ఉండే లైకోపిన్ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా పచ్చిమిర్చిలో యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కొద్దీ నిముషాల్లోనే శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. ఇంకా కొద్దీ నూనె ఉంటే చాలు . చాలా తక్కువ నూనెతో చేసే ఈ చేతి పచ్చడి చాలా మంచిది