
ఈ రోజుల్లో ఎంతో మందికి జుట్టురాలిపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇంకా ఎక్కువగా రాలకుండా ఉండాలంటే ఈ చిట్కాలను మనం పాటించాలి. వీటిని పాటించడం వల్ల జుట్టు ఊడదు ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి, ఇంకా జుట్టు రాలడం తగ్గడానికి మంచిగా సహాయపడుతుంది. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మనం తలస్నానం చేయడానికి మూడు లేదా నాలుగు గంటల ముందు కొబ్బరి నూనె పెట్టుకుని, మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూడు లేదా నాలుగు గంటలకు తలస్నానం చేయాలి. ముందు రోజు రాత్రి నూనె పెట్టుకుని బయటకు వెళ్లడం వల్ల దుమ్ము, ధూళి జుట్టుకు అంటుకునే అవకాశం ఉంటుంది.

కాబట్టి తలస్నానానికి కొన్ని గంటల ముందు నూనె పెట్టుకోవడం మంచిది. ఎక్కువ వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారి బలహీనంగా మారవచ్చు. కాబట్టి తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. షాంపూను ఎప్పుడూ నేరుగా తలపై ఎక్కువగా పోసుకోకూడదు.

ఒక మగ్గులో షాంపూ తీసుకుని, కొద్దిగా నీళ్లు కలిపిన తర్వాత తలకు పట్టించి తలస్నానం చేసుకోవాలి.జుట్టును ఆరబెట్టడానికి ఎక్కువ వేడి వచ్చే హెయిర్ డ్రైయర్లను ఉపయోగించకూడదు. వాటి వేడి వల్ల జుట్టు పొడిబారి, గరుకుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సహజంగా ఎండకు లేదా గాలికి మాత్రమే జుట్టును ఆరబెట్టుకోవడానికి ప్రయత్నించాలి.

తడి జుట్టును ఎప్పుడూ బలంగా దువ్వకూడదు. తడి జుట్టు బలహీనంగా ఉండటం వల్ల సులభంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు కొంతవరకు ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో మెల్లగా చిక్కులు తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఐదు చిట్కాలను పాటించడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జుట్టు విరిగిపోవడాన్ని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది