
మీరు ప్రతి నెలా మీ జీతం నుంచి ఇంటి సామాను కోసం ఒక స్థిరమైన బడ్జెట్ నిర్ణయించుకోవాలి. అంతే కాకుండా దాని ప్రకారమే కొనుగోలు చేయాలి. ఎలాంటి సిట్యూవేషన్ ఎదురు అయినా సరే దానిని మార్చకూడదు. ఇలా చేయడం వలన మీరు మీ ఇంటి కిరాణా సామాను కోసం ఎక్కువ అనవసరంగా ఖర్చు చేయకుండా డబ్బును ఆదా చేసుకోవచ్చును.

ఇక ఈ మధ్య కాలంలో సూపర్ మార్కెట్‌లలో అనేక ఆఫర్లు, డిస్కౌంట్స్ ఇస్తుంటారు. వాటిని ఉపయోగించుకోవడం వలన కూడా మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చును. అయితే వీటిని సరిగ్గా అర్థం చేసుకొని, మోసపోకుండా ఉపయోగించుకోవాలి. అటువంటి సమయంలో మీరు మీ జీతాన్ని సులభంగా ఆదా చేసుకోగలుగుతారు.

చాలా మంది బియ్యం, పప్పులు వంటి నిత్యవసర వస్తువులను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. కానీ అస్సలే అలా చేయకూడదంట. పెద్ద మొత్తంలో కొనడం వలన యూనిట్ ధర తగ్గుతుంది. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరపడం వలన డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతుందంట.

చాలా మంది ఖరీదైన బ్రాండ్స్ వైపు మొగ్గుచూపుతారు. కానీ మీరు డబ్బును పొదుపు చేయాలి అనుకుంటే తప్పకుండా ఖరీదై వాటిపై కాకుండా నాణ్యమైన వాటిపై దృష్టిపెట్టాలని చెబుతున్నారు నిపుణులు. కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద షాపుల్లో కాకుండా చిన్న చిన్న షాపుల్లో కూడా నాణ్యమైన వస్తువులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కాట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చునంట.

అదే విధంగా చాలా మంది క్యాష్ ఇచ్చి చెల్లింపులు చేస్తుంటారు. అయితే పేమెంట్ యాప్స్ ద్వారా చేయడం వలన కొన్ని సార్లు ఎక్కువ మొత్తంలో క్యాష్ బ్యాక్ రివార్డ్స్ పొంద వచ్చును. దీని వలన మీరు డబ్బును ఆదా చేసే ఛాన్స్ఉన్నదని చెబుతున్నారు నిపుణులు.