Grizzly Bear Attack: నాలుగు ఎలుగుబంట్లకు మరణశిక్ష! అవి చేసిన ఘోర నేరమేంటో తెలుసా?

Updated on: Nov 11, 2026 | 9:51 PM

Grizzly Bear Attack in Canada: కెనడాలో గ్రిజ్లీ ఎలుగుబంటి దాడిలో తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. DNA పరీక్షల్లో ఒక ఆడ ఎలుగుబంటి, దాని మూడు పిల్లలు ఈ దాడిలో పాల్గొన్నట్లు తేలింది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు నాలుగు ఎలుగుబంట్లనూ హతమార్చారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి దాడి జరగడం కలకలం రేపుతోంది.

1 / 5
Grizzly Bear Attack in Canada Telugu: కెనడాలో గ్రిజ్లీ ఎలుగుబంటి దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఎలుగుబంట్లను గుర్తించేందుకు నిర్వహించిన DNA పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఆడ గ్రిజ్లీ ఎలుగుబంటితో పాటు దాని మూడు పిల్లలు ఈ దాడిలో పాల్గొన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాలుగు ఎలుగుబంట్లనూ హతమార్చారు.

Grizzly Bear Attack in Canada Telugu: కెనడాలో గ్రిజ్లీ ఎలుగుబంటి దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఎలుగుబంట్లను గుర్తించేందుకు నిర్వహించిన DNA పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఆడ గ్రిజ్లీ ఎలుగుబంటితో పాటు దాని మూడు పిల్లలు ఈ దాడిలో పాల్గొన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాలుగు ఎలుగుబంట్లనూ హతమార్చారు.

2 / 5

ఎలుగుబంటి దాడిలో తల్లి, కూతురు మృతి.. 
బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 48 ఏళ్ల జెన్నీ బల్కరస్, ఆమె 20 ఏళ్ల కుమార్తె సెలా రీడ్ గ్రిజ్లీ ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వాంకోవర్ నగరానికి ఉత్తరాన సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో వీరి అవశేషాలను గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఎలుగుబంటి దాడిలో తల్లి, కూతురు మృతి.. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 48 ఏళ్ల జెన్నీ బల్కరస్, ఆమె 20 ఏళ్ల కుమార్తె సెలా రీడ్ గ్రిజ్లీ ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వాంకోవర్ నగరానికి ఉత్తరాన సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో వీరి అవశేషాలను గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

3 / 5

DNA పరీక్షల్లో కీలక విషయాలు.. 
ఈ దాడికి కారణమైన ఎలుగుబంట్లను గుర్తించేందుకు వన్యప్రాణి అధికారులు DNA పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక ఆడ గ్రిజ్లీ ఎలుగుబంటి, దాని ఏడాది వయసున్న మూడు పిల్లలు దాడిలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయింది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అధికారులు, ఆహారం కోసం వేటాడే సహజ ప్రవృత్తి కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

DNA పరీక్షల్లో కీలక విషయాలు.. ఈ దాడికి కారణమైన ఎలుగుబంట్లను గుర్తించేందుకు వన్యప్రాణి అధికారులు DNA పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక ఆడ గ్రిజ్లీ ఎలుగుబంటి, దాని ఏడాది వయసున్న మూడు పిల్లలు దాడిలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయింది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అధికారులు, ఆహారం కోసం వేటాడే సహజ ప్రవృత్తి కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

4 / 5

నాలుగు ఎలుగుబంట్లను హతమార్చిన అధికారులు.. 
ఈ ఘటన నేపథ్యంలో ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాడిలో పాల్గొన్న నాలుగు ఎలుగుబంట్లను హతమార్చినట్లు బ్రిటిష్ కొలంబియా కన్జర్వేషన్ ఆఫీసర్ సర్వీస్ వెల్లడించింది. మనుషులపై ప్రాణాంతక దాడికి పాల్పడిన ఎలుగుబంట్లను మరో ప్రాంతానికి తరలించడం లేదా పునరావాసం కల్పించడం ప్రమాదకరమని అధికారులు అభిప్రాయపడ్డారు.

నాలుగు ఎలుగుబంట్లను హతమార్చిన అధికారులు.. ఈ ఘటన నేపథ్యంలో ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాడిలో పాల్గొన్న నాలుగు ఎలుగుబంట్లను హతమార్చినట్లు బ్రిటిష్ కొలంబియా కన్జర్వేషన్ ఆఫీసర్ సర్వీస్ వెల్లడించింది. మనుషులపై ప్రాణాంతక దాడికి పాల్పడిన ఎలుగుబంట్లను మరో ప్రాంతానికి తరలించడం లేదా పునరావాసం కల్పించడం ప్రమాదకరమని అధికారులు అభిప్రాయపడ్డారు.

5 / 5
శీతాకాలానికి ముందు ఎలుగుబంట్లు ఎందుకు దూకుడుగా ఉంటాయి?.. 
గ్రిజ్లీ ఎలుగుబంట్లు శీతాకాలంలో సుదీర్ఘ నిద్రాణస్థితిలోకి వెళ్లే ముందు శరీరంలో కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి. ఇందుకోసం అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటాయి. ఈ సమయంలో ఆహారం కోసం నిరంతరం వెతుకుతూ ఉండటం వల్ల మనుషులతో ఎదురుపడే అవకాశాలు పెరుగుతాయి. కాగా, ఇదే ప్రాంతంలో గత ఏడాది నవంబర్‌లోనూ ఎలుగుబంటి దాడి జరిగింది. పాఠశాల విద్యార్థుల బృందంపై జరిగిన ఆ దాడిలో పిల్లలతో సహా 11 మంది గాయపడ్డారు. అయితే, గతంలో దాడికి పాల్పడిన ఎలుగుబంట్లకు, తాజాగా తల్లి, కూతురి మరణాలకు కారణమైన ఎలుగుబంట్లకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.

శీతాకాలానికి ముందు ఎలుగుబంట్లు ఎందుకు దూకుడుగా ఉంటాయి?.. గ్రిజ్లీ ఎలుగుబంట్లు శీతాకాలంలో సుదీర్ఘ నిద్రాణస్థితిలోకి వెళ్లే ముందు శరీరంలో కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి. ఇందుకోసం అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటాయి. ఈ సమయంలో ఆహారం కోసం నిరంతరం వెతుకుతూ ఉండటం వల్ల మనుషులతో ఎదురుపడే అవకాశాలు పెరుగుతాయి. కాగా, ఇదే ప్రాంతంలో గత ఏడాది నవంబర్‌లోనూ ఎలుగుబంటి దాడి జరిగింది. పాఠశాల విద్యార్థుల బృందంపై జరిగిన ఆ దాడిలో పిల్లలతో సహా 11 మంది గాయపడ్డారు. అయితే, గతంలో దాడికి పాల్పడిన ఎలుగుబంట్లకు, తాజాగా తల్లి, కూతురి మరణాలకు కారణమైన ఎలుగుబంట్లకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us