
పెసరపప్పు లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పెసరపప్పు, బెల్లం లేదా పంచదార పొడి లేదా పటిక బెల్లం పొడి, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 06 జీడిపప్పు, 06 బాదం, ఇవి లడ్డూకి మంచి టెస్ట్ ను ఇస్తాయి. ఇంకా మంచి సువాసనను కూడా ఇస్తాయి.

పెసరపప్పు ఇలా వేయించాలి : ముందుగా గ్యాస్ వెలిగించి పాన్‌లో పెసరపప్పును మీడియం మంటపై వాటిని వేయించాలి. ఎలా అంటే మంచి వాసన వచ్చేవరకు, ఇంకా గోల్డ్ కలర్లోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి. అలా వేయించిన వాటిని ఫ్యాన్ కింద బాగా చల్లారనివ్వాలి. ఇలా చేస్తే త్వరగా పిండి అవుతాయి.

పెసరపప్పు ఇలా పొడిగా మిక్సీ పట్టుకోవాలి: బాగా చల్లారిన పెసరపప్పును మిక్సీ లో వేసుకుని వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా వాటిని పొడిలాగా చేసుకోవాలి. ఇంకా ఇది మెత్తగా ఉంటే లడ్డూలు కూడా సాఫ్ట్‌గా వస్తాయి. నోటిలో పెట్టుకోగానే కరిగిపోతాయి. అలాగే, పిండి బరకగా కూడా ఉండకూడదు. అలా చేస్తే ఉండ మంచిగా రాదు.

బెల్లం పాకం లేదా పటిక బెల్లం పాకం దీనిలో కలుపుకోవాలి: పాన్‌లో బెల్లం లేదా పటిక బెల్లాన్ని నీటితో కరిగించాలి. ఇది చిక్కబడే వరకు స్టవ్ మీదే బాగా మరిగించాలి. ఆ తరవాత పెసర పప్పు పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. మరి ఎక్కువగా పోయకండి. ఉండ చుట్టే వరకు వస్తుందో లేదో అంత పాకం మాత్రమే పోయండి.

ఇప్పుడు నెయ్యి కూడా దీనిలో కలిపి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది చేత్తో యాలకుల పొడిని దీనిలో వేస్తె రుచి పెరుగుతుంది. చేతితో పట్టేలా ఉండేలా చూసుకోవాలి. ఇది వేడి మీదే ఉన్నప్పుడే చేతికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రాసుకుని లడ్డూలుగా చేసుకుని తినడమే. ఎండాకాలంలో తినాల్సిన హెల్దీ స్నాక్.. పిల్లలతోపాటు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు.