
మేక నల్ల కూరకు కావలసిన పదార్థాలు : అర కిలో మేక బ్లడ్, రెండు చిన్న ఉల్లిపాయలు , 5 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రెండు టేబుల్ స్పూన్ కారం , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , అర టేబుల్ స్పూన్ మిరియాల పొడిను తీసుకోవాలి.

మేక నల్ల కూరకు కావలసిన పదార్థాలు: అర టేబుల్ స్పూన్ గరం మసాలా, 10 కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ గస గసాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా తీసుకోవాలి. అయితే దీనిని కడిగే ముందు కొంత సేపు వేడి నీళ్లలో పెట్టుకోవాలి.

మేక నల్ల కూర తయారీ విధానం : ముందుగా మేక బ్లడ్‌ను తీసుకుని బాగా కడిగి దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఒక పాత్రలో నీరు కూడా పోసి 5 నిమిషాలు పాటు ఉడికించి, దీనిని కిందకు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఈ ముక్కలు మంచిగా ఉడుకుతాయి.

మేక నల్ల కూర తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు కూడా వేసి వీటిని బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. కొద్దీ సేపటి తరువాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దీ సేపు పొయ్యి మీదే ఉంచి బాగా వేగనివ్వాలి

ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి కలపాలి. ఇక ఇప్పుడు చివర్లో ముందుగా ఉడికించిన నల్ల ముక్కలకు మసాలాలు పట్టేలా గరిటెతో దీనిని బాగా కలుపుతూ 5 నిమిషాలు పాటు వేయించాలి. ఇంకా అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కూడిగా గరం మసాలా, ఉప్పు కూడా వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర వేసి దించేయాలి.