
వృషభ రాశి (Taurus): ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, శుక్ర గ్రహాల మధ్య వైరం ఉంటుంది. బంగారం గురు గ్రహానికి సంకేతం. కాబట్టి వృషభ రాశి వారు బంగారం ధరించడం వల్ల వ్యాపారంలో నష్టాలు లేదా వ్యక్తిగత జీవితంలో గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతారు.

మిథున రాశి (Gemini): మిథున రాశి అధిపతి బుధుడు. ఈ రాశి వారు బంగారం ధరిస్తే మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవ్వడం లేదా అనవసరమైన ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

కన్యా రాశి (Virgo): కన్యా రాశి వారికి కూడా బంగారం అంతగా కలిసిరాదు. ఇది వారి పురోగతిని అడ్డుకుంటుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరు బంగారు ఆభరణాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.

కుంభ రాశి (Aquarius): శని దేవుడు అధిపతిగా ఉన్న కుంభ రాశి వారికి బంగారం ధరించడం వల్ల శని ప్రభావం ప్రతికూలంగా మారవచ్చు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా, పనుల్లో జాప్యాన్ని కలిగిస్తుంది. ఈ రాశులకు అధిపతులైన గ్రహాలకు, బంగారానికి అధిపతి అయిన గురు గ్రహానికి శతృత్వం ఉండటమే దీనికి ప్రధాన కారణం.

బంగారం ధరించడం వల్ల మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే పైన పేర్కొన్న రాశుల వారు ఒకవేళ బంగారం ధరించాలనుకుంటే, చిన్న ఉంగరం లేదా గొలుసుతో ప్రయత్నించి.. ఫలితాలను గమనించాక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. జ్యోతిష్యం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, వ్యక్తిగత జాతకాలను బట్టి మార్పులు ఉండవచ్చు.