
ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,690 గా ఉండగా ఉదయం ఈ ధర రూ.1,52,720 వద్ద కొనసాగింది. అంటే కేవలం 4 గంటల్లోనే ఏకంగా తులం బంగారంపై రూ.1040 తగ్గింది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,050 వద్ద కొనసాగుతుండగా.. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,770 వద్ద కొనసాగుతుంది.

ఇక విజయవాడ, విశాఖ పట్నంలో సైతం 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,690 గా ఉండగా ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,050 వద్ద కొనసాగుతుండగా.. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,770 వద్ద కొనసాగుతుంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కేరళ, పూణెలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై నగరాల్లో మాత్రం మిగతా నగరాలతో పోల్చుకుంటే బంగారం, వెండి ధరలు మార్పులు ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51, 840గా ఉండగా 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,200గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.1,53,490గా ఉండగా 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,700 వద్ద కొనసాగుతుంది.

ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,60,000 ఉండగా ఉదయం ఈ ధర రూ.2,69,900 వద్ద కొనసాగింది. అంటే కేవలం 4 గంటల్లోనే ఈ ధరలు రూ.10వేలు దిగొచ్చింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది.

బంగారం కొనేవారికి ఇదే మంచి టైం.. లేదంటే బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దం కారణంగా కొన్ని నెలల క్రితం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. యుద్ధం తగ్గుముఖం పట్టడంతో.. దిగొచ్చాయి. అయితే తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాబట్టి ఈ ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీకు కొనే ఆలోచన ఉంటే ఒక సారీ మీరు కూడా నిపుణులను సంప్రదించిండి.