ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ సింపుల్ ట్రిక్ పాటించండి!

Updated on: Apr 07, 2026 | 12:20 PM

సమ్మర్‌ హాలీడేస్‌ వచ్చాయంటే చాలా మంది టూర్‌ ప్లాన్‌ చేస్తుంటారు. సెలవులు వచ్చాయంటే చాలు అందరూ విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొందరు సొంతుళ్లకు వెళ్తుంటారు. అయితే గార్డెనింగ్ ఇష్టపడే వారికి ఉన్న పెద్ద సమస్య మొక్కలు. మనం ఇంట్లో లేని సమయంలో వాటికి నీరు ఎవరు పోస్తారు? అవి ఎండిపోతాయేమో అనే ఆందోళన ఉంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన ఈ సింపుల్ హ్యాక్ ద్వారా మీ మొక్కలు మీరు వచ్చే వరకు తాజాగా ఉంటాయి.

1 / 5
మీరు సెలవుల కోసం ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లోని మొక్కలు ఎండిపోకుండా ఉండటానికి ప్రతిరోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ మొక్కలకు నీరు అందించడానికి కాటన్ రోప్ డ్రిప్ సిస్టమ్ (Cotton Rope Drip System) లేదా వైలరీ మెథడ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

2 / 5
కాపిల్లరీ వాటరింగ్ సిస్టమ్ (Capillary Watering System) ఎలా చేయాలి?: దీని కోసం ఒక పెద్ద నీటి పాత్ర లేదా బకెట్ తీసుకోవాలి. కాటన్ తాడు (Cotton Rope) లేదా నూలు బట్టతో చేసిన పొడవైన ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బకెట్ నిండా నీరు నింపి, దానిని మీ మొక్కల కుండీల కంటే కాస్త ఎత్తైన ప్రదేశంలో ఉంచండి. కాటన్ తాడును తీసుకుని, దాని ఒక చివరను బకెట్ అడుగు భాగం వరకు వెళ్లేలా వేయండి. అది నీటిలో పూర్తిగా మునిగి ఉండాలి.

3 / 5
ఇప్పుడు తాడు రెండో చివరను మొక్క కుండీలోని మట్టిలో 2 నుండి 3 అంగుళాల లోతుకు పాతిపెట్టండి. ఇలా చేయటం వల్ల కాపిల్లరీ యాక్షన్ ద్వారా తాడు నీటిని పీల్చుకుని, బకెట్ నుండి నిరంతరం తక్కువ మొత్తంలో మొక్కకు అందిస్తూ ఉంటుంది. మట్టి ఎండిపోయినప్పుడల్లా ఈ తాడు ద్వారా తేమ మొక్కకు చేరుతుంది.

4 / 5
మొక్కలను నేరుగా సూర్యరశ్మి తగిలే చోట కాకుండా, కొంచెం నీడ ఉన్న ప్రదేశంలో ఉంచితే తేమ ఎక్కువ కాలం ఉంటుంది. మీరు ఎక్కువ రోజులు వెళ్తుంటే బకెట్ పైన మూత పెట్టి, కేవలం తాడు బయటకు వచ్చేలా చూడండి. దీనివల్ల బకెట్‌లోని నీరు ఆవిరి కాకుండా ఉంటుంది.

5 / 5
ఒకే పెద్ద బకెట్ నుండి మూడు నాలుగు తాడులు కట్టి వేర్వేరు కుండీలకు నీటిని అందించవచ్చు. ఈ పద్ధతి ద్వారా మీరు 7 నుండి 10 రోజుల పాటు నిశ్చింతగా మీ ట్రిప్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఖరీదైన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ అవసరం లేకుండానే, కేవలం ఇంటి వస్తువులతో మీ పచ్చని మొక్కలను కాపాడుకోవచ్చు.

Follow Us