అల్లం వంకాయ కూర.. తింటే, ఎంత మొండి జలుబు అయినా పారిపోవాల్సిందే

Updated on: Nov 06, 2026 | 8:18 AM

పండుగ వచ్చిందంటే చాలు ఉపవాసాలు, వ్రతాలు, పూజలతో పాటు ప్రత్యేక వంటకాలకు ప్రాధాన్యత ఉంటుంది. వ్రత దీక్షలో ఉన్నవారు తినడానికి అనుకూలమైన అల్లం వంకాయ కూర ఒక సాంప్రదాయక, శుద్ధ సాత్విక వంటకం. ఉల్లిపాయలు, వెల్లుల్లిని వాడకుండా తయారుచేసే ఈ కూర ఆలయాల్లో చేసే వంటకాల రుచిని పోలి ఉంటుంది.

1 / 5

2 / 5

ఈ అల్లం వంకాయ కూరకు తాజా అల్లం, తెల్ల వంకాయలు వాడాలి.  30-35 గ్రాముల అల్లాన్ని మెత్తగా దంచి పక్కన ఉంచుకోవాలి. అల్లాన్ని రోట్లో దంచడం వేయడం వల్ల అది చితికి రసం విడుదలవుతుంది. ఇది మిక్సీలో బరకగా రుబ్బడం కంటే ఎక్కువ రుచిని ఇస్తుందని వంట నిపుణులు సూచిస్తారు.

3 / 5

కూర తయారీకి ముందుగా ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల నూనెను వేడిచేయాలి. ఈ కూరకు నూనెలు ఎక్కువగా ఉంటేనే రుచి పెరుగుతుంది. వేడెక్కిన నూనెలో ఒక టీస్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి ముక్కలు వేసి, మిర్చి నల్లబడేంత వరకు వేపాలి. ఇలా చేయడం వల్ల వంటకానికి ఒక ప్రత్యేకమైన స్మోకీ రుచి వస్తుంది. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఎర్రగా వేపాలి. ఈ దశలో అల్లంలో ఉడికిన నూనె అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుందని అంటారు.

4 / 5
పప్పు ఎర్రబడ్డాక అర టీస్పూన్ జీలకర్ర, ఇంగువ, ఒక రెబ్బ కరివేపాకు వేసి వేపాలి. కరివేపాకు వేగిన తర్వాత, ముందుగా నూరుకున్న అల్లం ముద్దను వేసి రెండు, మూడు నిమిషాల పాటు వేపాలి. అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత, రెండు పచ్చిమిర్చిని చీరి వేసి వేపాలి. ఉల్లిపాయలు తినేవారు ఈ దశలో చిన్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవచ్చు. అయితే, అది వేస్తే ఒక రుచి, వేయకపోతే ఒక రుచి వస్తుంది.

5 / 5

తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పొడి మసాలాలు నూనెలో కాస్త వేగాక, సుమారు 500 గ్రాముల తెల్ల వంకాయ ముక్కలను వేయాలి. వంకాయ ముక్కలను క్యూబ్స్‌గా తరగాలి.  వంకాయ ముక్కలకు మసాలాలు పట్టిన తర్వాత, మూత పెట్టకుండా మూడు, నాలుగు నిమిషాల పాటు వేపాలి. ఆ తర్వాత మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో వంకాయ మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. వంకాయ పూర్తిగా ఉడికి, మెత్తబడిన తర్వాత దండిగా కొత్తిమీర తరుగు చల్లి, మరొక రెండు నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us