నెయ్యి + తమలపాకు కాంబినేషన్.. ఆ సమస్యలకు చెక్‌పెట్టే రామబాణం.. ఆరోగ్యానికి ఔషధ నిధి!

Updated on: Jul 05, 2026 | 8:25 AM

పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే స్వచ్ఛమైన తాజా నెయ్యిని తయారు చేసుకునేవారు.. ఇంట్లో వెన్నను కరిగించి నెయ్యి చేసేటప్పుడు అందులో ఒక తమలపాకును వేయడం మీరు చూసే ఉంటారు. అలా వేసినప్పుడు వచ్చే చిటపట శబ్దం, ఇల్లంతా వ్యాపించే ఆ సువాసనే వేరు. అయితే, ఇలా నెయ్యిలో తమలపాకు వేయడం కేవలం సువాసన కోసమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని ఆయుర్వేదం, ఆధునిక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
కొలెస్ట్రాల్ తగ్గుతుంది: కొన్ని వైద్య అధ్యయనాల (IJAM) ప్రకారం, నెయ్యి తయారీలో తమలపాకులను ఉపయోగించడం వల్ల నెయ్యిలో ఉండే కొలెస్ట్రాల్ లేదా లిపిడ్స్ శాతాన్ని దాదాపు 10 శాతం వరకు తగ్గించవచ్చు. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక.

2 / 5
నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది: తమలపాకుల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ (Oxidation) ప్రక్రియను అడ్డుకుని, నెయ్యి ముక్కిన వాసన రాకుండా చూస్తాయి. దీనివల్ల నెయ్యి ఎక్కువ కాలం ఫ్రెష్‌గా నిల్వ ఉంటుంది.

3 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: తమలపాకుల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, టెర్పెన్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను (Inflammation) తగ్గించి, సూక్ష్మజీవులను నశింపజేస్తాయి. ఈ కాంబినేషన్ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం త్వరగా గ్రహించేలా (Absorption) చేస్తుంది.

4 / 5
ఈ కాంబినేషన్ జీర్ణక్రియకు ఎంతో మేలు చేసినప్పటికీ, దీనిని రోజువారీ ఆహారంలో పరిమితికి మించి క్రమం తప్పకుండా తీసుకునేటప్పుడు కొన్ని హెచ్చరికలను కూడా గమనంలో ఉంచుకోవాలి. తమలపాకులు పండే నేల, వాతావరణ పరిస్థితుల వల్ల కొన్నిసార్లు వాటిలో ఆర్సెనిక్, సీసం (Lead), కాడ్మియం, క్రోమియం వంటి టాక్సిక్ భారీ లోహాలు చేరే అవకాశం ఉంది. ఇవి శరీరంలోకి చేరితే దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

5 / 5
కొన్ని అధ్యయనాల ప్రకారం, తమలపాకుల్లో సహజంగా ఉండే ఆల్కలాయిడ్స్, టానిన్లు వంటి సమ్మేళనాలను మోతాదుకు మించి దీర్ఘకాలం పాటు తీసుకుంటే, అవి కణాల్లోని సాధారణ ప్రక్రియలకు ఆటంకం కలిగించి డీఎన్ఏ (DNA) ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. నెయ్యిలో తమలపాకు వేసి కాచడం వల్ల రుచి, ఆరోగ్యం లభిస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఏ ఆరోగ్య చిట్కానైనా పరిమితంగా వాడుకున్నప్పుడే అమృతంలా పనిచేస్తుంది. అతిగా వాడితే సమస్యలు తప్పవు. కాబట్టి మోతాదును గమనిస్తూ ఈ సాంప్రదాయ రుచిని ఆస్వాదించండి.

Follow Us