కడుపులో అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బందా? ఇంటి చిట్కాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Updated on: Oct 16, 2026 | 3:22 PM

మారిన జీవన విధానం, పెరిగిన కాలుష్యం, తీసుకున్న ఆహారంలో లోపాలు వంటి అనేక కారణాల వల్ల గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలు ఈ రోజుల్లో చిన్నవయసు వారి నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్నాయి. నిజానికి, ఈ సమస్యలు ఆహారపుట అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం తేలిగ్గా నయం చేసుకోవచ్చు.

1 / 5
 నాలుగు వారాల పాటు ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆవుపాలు, గేదె పాలతో పాటు నువ్వుల, కొబ్బరి, రాగి పాలతో కూడా పెరుగు తయారుచేసుకుని మజ్జిగలా వాడుకోవచ్చు. కొర్రలు, రాగులు వంటి చిరుధాన్యాలను రోజుకు ఒక రకం చొప్పున తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రమై, అల్సర్ సమస్యలు తగ్గుతాయి. గంజి రూపంలో తీసుకుంటే మరింత తొందరగా ఫలితం ఉంటుంది. పులియబెట్టిన గంజి చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి, గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది.

2 / 5
విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల కడుపులో పుండ్లను నయం చేస్తుంది. రోజువిడిచి రోజు ఒక గ్లాసు క్యాబేజీ రసం తీసుకోవడం మంచిది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి చేసే గుణాలు ఉంటాయి, ఇవి అల్సర్ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.

3 / 5
వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే కాంపౌండ్ పెప్టిక్ అల్సర్లను నివారించడంలో ఉపయోగపడుతుంది. రోజుకు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం మంచిది. పసుపులోని కర్కుమిన్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అల్సర్ కలిగించే బ్యాక్టీరియాను పెరగనివ్వదు. గోరువెచ్చని నీటిలో పసుపు, కొద్దిగా తేనె కలిపి తాగడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది.

4 / 5
పొట్ట సంబంధిత సమస్యలకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. మెంతి ఆకులను నీటిలో ఉడికించి, ఆ నీటిని వడగట్టి కొద్దిగా ఉప్పు కలిపి తాగాలి.జీలకర్ర కషాయం, తమలపాకుల కషాయం. ఇవి కూడా పొట్ట సమస్యలను నయం చేయడంలో బాగా పనిచేస్తాయి.
 గ్యాస్ట్రిక్, అల్సర్ ఉన్నవారికి తరచుగా వచ్చే త్రేన్పులు, నోటి దుర్వాసనను తగ్గించడంలో ఆవాల కషాయం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

పొట్ట సంబంధిత సమస్యలకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. మెంతి ఆకులను నీటిలో ఉడికించి, ఆ నీటిని వడగట్టి కొద్దిగా ఉప్పు కలిపి తాగాలి.జీలకర్ర కషాయం, తమలపాకుల కషాయం. ఇవి కూడా పొట్ట సమస్యలను నయం చేయడంలో బాగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్, అల్సర్ ఉన్నవారికి తరచుగా వచ్చే త్రేన్పులు, నోటి దుర్వాసనను తగ్గించడంలో ఆవాల కషాయం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

5 / 5
వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు స్టమక్ అల్సర్ పెరగకుండా నివారిస్తాయి. కొబ్బరినీళ్లలో ఉండే మినరల్స్ పొట్టను శుభ్రపరిచి, చల్లబరిచి, అల్సర్ సమస్యను తగ్గిస్తాయి. గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్య ఉన్నవారు కాఫీలు, టీలు తగ్గించాలి. స్మోకింగ్, డ్రింకింగ్ పూర్తిగా మానేయాలి. వేళకు భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం, సరిపడా నీరు తాగడం వంటి అలవాట్లను పాటిస్తే ఈ సమస్యల నుండి పూర్తిగా బయటపడవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహార నియమాలు కడుపు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us